KKR vs SRH: ఐపీఎల్ 2024 క్వాలిఫయర్-1 మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్లు తలపడుతున్నాయి. మరోసారి తమ బ్యాట్ పవర్ ను చూపించడానికి వచ్చేస్తోంది ప్యాట్ కమ్మిన్స్ సేన సన్ రైజర్స్ హైదరాబాద్. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది.
IPL 2024 Qualifier-1 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (ఐపీఎల్-2024) క్వాలిఫయర్-1 మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్లు తలపడున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హైదరాబాద్ టీమ్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ప్యాట్ కమ్మిన్స్ సేన ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు పరుగులు వరద పాటించాడు. విజయాల పరంగా కూడా ఈ విషయంలో మెరుగ్గా ఉంది. ఈ సీజన్ లో 7 సార్లు టాస్ గెలిచిన హైదరాబాద్ టీమ్ 5 సార్లు తొలుత బ్యాటింగ్ చేసిన సమయంలో గెలుపొందింది.
కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఛేజింగ్ చేయడానికి మంచి వికెట్ ఉంటుందని చెప్పాడు. ఒకరు తొలుత బ్యాటింగ్ చేయడం పై నమ్మకం ఉంచితే, మరోకరు ఛేజింగ్ పై నమ్మకం పెట్టుకున్నారు. ఐపీఎల్ 2024 లో మొదటి రెండు స్థానాల్లో నిలిచి బలమైన జట్లుగా ఉన్న ఈ టీమ్స్ మధ్య మరో బిగ్ ఫైట్ ను మళ్లీ చూడవచ్చు. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే అది నేరుగా చెన్నైలో ఫైనల్ కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టుకు మరో అవకాశం కూడా ఉంటుంది. క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు తదుపరి మ్యాచ్ మే 24న ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో తలపడుతుంది. క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది.
KKR vs SRH: వర్షంతో ఐపీఎల్ 2024 క్వాలిఫైయర్-1 రద్దు అయితే ఫైనల్‌కి వెళ్లేది ఎవరు?
జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ 11): రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ 11): ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, విజయకాంత్, టి నటరాజన్.
KKR VS SRH బిగ్ ఫైట్.. ఐపీఎల్ 2024 క్వాలిఫైయర్-1లో గెలిచేది ఎవరు? వీళ్లు చాలా డేంజరస్ ..