KKR vs SRH: వర్షంతో ఐపీఎల్ 2024 క్వాలిఫైయర్-1 ర‌ద్దు అయితే ఫైనల్‌కి వెళ్లేది ఎవ‌రు?

By Mahesh Rajamoni  |  First Published May 21, 2024, 1:48 PM IST

KKR vs SRH: ఐపీఎల్ 2024 క్వాలిఫయర్-1 మ్యాచ్ లో  కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7:30 గంట‌ల‌కు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ ను వ‌ర్షం దెబ్బకొడితే ఏం జరుగుతుంది? ఫైనల్ కు వెళ్లేది ఏ జట్టు? 


IPL 2024 Qualifier-1 : ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2024 టోర్న‌మెంట్ లో లీగ్ ద‌శ మ్యాచ్ లు ముగిశాయి. ఐపీఎల్ 2024 టైటిల్ కోసం కోల్‌కతా, హైద‌రాబాద్, రాజ‌స్థాన్, బెంగ‌ళూరు జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలోనే  కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మధ్య  ఐపీఎల్ 2024 క్వాలిఫయర్-1 మ్యాచ్ మంగ‌ళ‌వారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో సాయంత్రం 7:30 నుండి జరగనుంది. మ‌రో ఆస‌క్తిక‌ర పోటీ క్ర‌మంలో అభిమానుల్లోనూ ఉత్కంఠ నెల‌కొంది. అయితే, ఈ మ్యాచ్ ను వ‌ర్షం దెబ్బ‌కొట్టే అవ‌కాశం  క‌నిపిస్తోంది.

ఐపీఎల్ 2024లో ఇప్పటి వరకు 3 మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మధ్య జరిగే క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో వర్షం పడితే ఏమవుతుంది?  ఫైన‌ల్ కు ఎవ‌రు వెళ్తారు? ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు గ‌మ‌నిస్తే..  గత ఐపీఎల్ సీజన్‌లో రిజర్వ్ డేని ఫైనల్‌కు మాత్రమే ఉంచారు. ఈ సీజన్‌లో మొత్తం నాలుగు ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉంది. అంటే ఈ రోజు వ‌ర్షం ప‌డితే రిజ‌ర్వ్ డే లో మ్యాచ్ ను నిర్వ‌హిస్తారు. అప్పుడు కూడా వ‌ర్షం అడ్డుప‌డితే..?

Latest Videos

క్వాలిఫయర్-1 వర్షం తో ర‌ద్దు అయితే ఏమవుతుంది?

ప్ర‌స్తుతం అందుతున్న ప‌లు వాతావ‌ర‌ణ శాఖల నివేదిక‌ల ప్రకారం, మే 21న అహ్మదాబాద్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మధ్య జరిగే క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో వర్షం కురిసే అవకాశం తక్కువగానే ఉన్నాయి. కానీ ప్ర‌స్తుతం ఒక్క‌సారిగా మారుతున్న ప‌రిస్థుల గురించి చెప్ప‌లేము. మే 21న అహ్మదాబాద్‌లో వాతావరణం ఆహ్లాదకరంగా, ఎండగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో మంచు కీలక పాత్ర పోషిస్తుంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో వర్షం కురిస్తే ఓవర్లు తగ్గే అవకాశం ఉంది. భారీ వర్షం కురిస్తే, మ్యాచ్‌ని కనీసం 5 ఓవర్లు ఉండేలా చూస్తారు. ఇది కూడా సాధ్యం కాకపోతే రిజర్వ్ డే రోజున మ్యాచ్ ఆడనుంది. రిజర్వ్ రోజున, వర్షం కారణంగా అంతకుముందు రోజు ఎక్కడ మిగిలిందో అక్కడ నుండి మ్యాచ్ ప్రారంభమవుతుంది.

ఫైనల్ గా కేకేఆర్ కు లాభిస్తుందా?

రిజర్వ్ డే కూడా వర్షం ప‌డితే కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. ఎందుకంటే లీగ్ దశలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు 14 మ్యాచ్‌ల్లో 20 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. అదే సమయంలో, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 14 మ్యాచ్‌లలో 17 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది. నిబంధనల ప్రకారం పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉన్నందున, మ్యాచ్ రద్దైన పక్షంలో కోల్‌కతా నైట్ రైడర్స్ నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది.

నా ఆట గురించి నాకు తెలుసు.. ఎవ‌రికీ చెప్పాల్సిన అవ‌స‌రం లేదు : విరాట్ కోహ్లీ

click me!