KKR vs SRH: ఐపీఎల్ 2024 క్వాలిఫయర్-1 మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్లు తలపడనున్నాయి. ఈ బిగ్ ఫైట్ లో ఏ జట్టుకు గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయి? ఎవరు ఫైనల్ కు వెళ్లబోతున్నారు? ఇరు జట్ల రికార్డులు ఇలా ఉన్నాయి..
IPL 2024 Qualifier-1 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (ఐపీఎల్-2024) క్వాలిఫయర్-1 మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్లు తలపడున్నాయి. ఈ మ్యాచ్ మంగళవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో సాయంత్రం 7:30 నుండి జరగనుంది. బలమైన జట్లుగా ఉన్న ఈ టీమ్స్ మధ్య మరో బిగ్ ఫైట్ ను మళ్లీ చూడవచ్చు. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే అది నేరుగా చెన్నైలో ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు ఆశలు అడియాశలు కాకుండా మరో అవకాశం కూడా ఉంటుంది. క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు తదుపరి మ్యాచ్ మే 24న ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో తలపడుతుంది. క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. క్వాలిఫయర్-1 లో తలపడే కేకేఆర్, ఎస్ఆర్హెచ్ రికార్డులు గమనిస్తే..
8వ సారి ప్లేఆఫ్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్..
undefined
కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు ఎనిమిదోసారి ప్లేఆఫ్‌లో ఆడబోతుంది. కోల్‌కతా (కేకేఆర్) ఇప్పటి వరకు ప్లే ఆఫ్స్‌లో 13 మ్యాచ్‌లు ఆడింది. ప్లేఆఫ్ రౌండ్‌లో కేకేఆర్ ఆడిన 13 మ్యాచ్‌ల్లో 8 గెలిచి 3 మ్యాచ్‌ల్లో ఓడింది. క్వాలిఫయర్-1లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు మంచి రికార్డు ఉంది. ఈ జట్టు 2012, 2014 సంవత్సరాల్లో క్వాలిఫయర్-1 గెలిచింది. ఈ రెండు సందర్భాలలో కేకేఆర్ ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది.
7వ సారి ప్లేఆఫ్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జట్టు ఏడోసారి ప్లేఆఫ్‌లో ఆడనుంది. హైదరాబాద్ జట్టు ఇప్పటి వరకు ప్లే ఆఫ్స్‌లో 11 మ్యాచ్‌లు ఆడింది. ప్లేఆఫ్ రౌండ్‌లో హైదరాబాద్ ఆడిన 11 మ్యాచ్‌లలో 5 గెలిచింది, 6 మ్యాచ్‌లలో ఓడింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ 2016 సంవత్సరంలో ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. 2018 సంవత్సరంలో క్వాలిఫయర్-1 ఆడింది, దీనిలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓడిపోయింది. ఆ తర్వాత 2018 ఫైనల్‌లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) సన్‌రైజర్స్ హైదరాబాద్ ను ఓడించింది.
ప్లేఆఫ్స్‌లో ఏ జట్టు బలంగా ఉంది?
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ప్లేఆఫ్ రౌండ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య 2 ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఒక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపొందగా, ఇంకో మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ గెలిచింది. 2018లో సన్‌రైజర్స్ హైదరాబాద్ క్వాలిఫయర్-2లో కోల్‌కతా నైట్ రైడర్స్ ని ఓడించి ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. ఓవరాల్‌గా ప్లేఆఫ్ రౌండ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్)పై సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) పైచేయి సాధించినట్లైంది. ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మధ్య 26 మ్యాచ్‌లు జరిగాయి. ఈ 26 మ్యాచ్‌ల్లో కోల్‌కతా 17 మ్యాచ్‌లు గెలవగా, హైదరాబాద్ 9 మ్యాచ్‌ల్లో విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం సీజన్ లో రెండు జట్లలోనూ ప్లేయర్లు సూపర్ ఫామ్ లో ఉన్నారు. కాబట్టి ఐపీఎల్ 2024 లో ఇది మరో బిగ్ ఫైట్ అనే చెప్పాలి.
KKR VS SRH: వర్షంతో ఐపీఎల్ 2024 క్వాలిఫైయర్-1 రద్దు అయితే ఫైనల్‌కి వెళ్లేది ఎవరు?