SRH Travis Head : ఐపీఎల్ 2024 లో బౌలర్లను చెడుగుడు ఆడుకుంటున్న సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ట్రావిస్ హెడ్ ను అర్ష్ దీప్ సింగ్ అద్భుతమైన ఇన్‌స్వింగర్.. మంచి లెంగ్త్ డెలివరీతో తొలి బంతికే గోల్డెన్ డక్ గా పెవిలియన్ కు పంపాడు.
Tata IPL 2024 Travis Head : ఐపీఎల్ 2024 69వ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) తలపడింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 214/5 పరుగులు చేసింది. అయితే, 215 పరుగలు భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టుకు బిగ్ షాక్ ఇస్తూ అర్ష్‌దీప్ సింగ్ పంజాబ్ కు భారీ ప్రయోజనాన్ని అందించాడు. మ్యాచ్ తొలి బంతికే భీకర ఫామ్ లో ఉండి, ఐపీఎల్ 2024 లో బౌలర్లను చెడుగుడు ఆడుకుంటున్న ట్రావిస్ హెడ్ ను ఔట్ చేశాడు. అర్ష్ దీప్ సింగ్ అద్భుతమైన ఇన్‌స్వింగర్.. మంచి లెంగ్త్ డెలివరీతో తొలి బంతికే ట్రావిస్ హెడ్ ను గోల్డెన్ డక్ గా పెవిలియన్ కు పంపాడు.
ఇప్పటికే పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2024 ప్లేఆఫ్‌ల రేసు నుండి ఎలిమినేట్ అయింది. కానీ, ప్లేఆఫ్‌లకు వెళ్లే ముందు మొదటి రెండు స్థానాల్లో నిలిచేందుకు ఈ మ్యాచ్ ను హైదరాబాద్ తప్పక గెలవాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్‌లో శిఖర్ ధావన్, సామ్ కర్రాన్ ఇద్దరూ యాక్షన్‌లో లేకపోవడంతో పంజాబ్ కింగ్స్‌కు జితేష్ శర్మ నాయకత్వం వహించాడు. జితేష్ శర్మ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అథర్వ తైదే (47), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (71) తొలి వికెట్‌కు 97 పరుగులు జోడించారు. రోసోవ్ 49 పరుగులు చేశాడు. చివర్లో వచ్చిన జితేష్ శర్మ కూడా 32 పరుగులు చేసి జట్టు స్కోరును 214కు చేర్చాడు.
undefined
ఐపీఎల్ చరిత్రలో ఇది రెండోసారి.. రాజస్థాన్ కు బిగ్ షాక్
215 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన హైదరాబాద్ కు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. అర్ష్‌దీప్ సింగ్ అద్భుతమైన ఇన్ స్వింగర్ తో ట్రావిస్ హెడ్ ను ఔట్ చేశాడు. ఐపీఎల్ 2024 లో బౌలర్లను సునామీల విరుచుకుపడుతున్న ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్ కు ముందు 11 గేమ్‌లలో 201.13 స్ట్రైక్ రేట్‌తో 533 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ 2024లో హెడ్ 61 ఫోర్లు, 31 సిక్సర్లు కొట్టాడు. అతని నుంచి మరో భారీ ఇన్నింగ్స్ వస్తుందని ఆశించిన క్రమంలో అర్ష్ దీప్ సింగ్ సూపర్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేసి.. ట్రావిస్ హెడ్ ను పెవిలియన్ కు పంపాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
నా ఆట గురించి నాకు తెలుసు.. ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు : విరాట్ కోహ్లీ
Talk about a spectacular start!
A BEAUT of a delivery from Arshdeep Singh to get things going! ❤️💪
Watch the match LIVE on and 💻📱 | | | pic.twitter.com/WInHujNQ8P
IPL 2024: స్టార్ స్పోర్ట్స్‌పై రోహిత్ శర్మ ఫైర్.. అసలు గొడవేంటి..?