IPL 2024 Playoffs Schedule : ఐపీఎల్ 2024 సీజన్‍లో కోల్‍కతా, హైదరాబాద్, రాజస్థాన్, బెంగళూరు ప్లేఆఫ్స్ చేరాయి. దీంతో ప్లేఆఫ్ పోరుకు షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. ఈ నాలుగు జట్ల మధ్య ప్లేఆఫ్స్ పోరు ఉండనుంది. ప్లేఆఫ్స్ షెడ్యూల్ ఇదే..
IPL 2024 Playoffs: ఐపీఎల్ 2024 సీజన్‍లో ప్లేఆఫ్స్ పోరుకు షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. లీగ్ దశ మ్యాచ్‍లు పూర్తి కావడంతో కేవలం ఒక్క రోజు గ్యాప్ తో అంటే.. మే 21 నుంచి ప్లేఆఫ్స్ పోరు ప్రారంభం కానున్నది. లీగ్ దశలో చివరి రోజు ఆదివారం (మే 19) నాడు జరిగిన మ్యాచ్ లో పంజాబ్‍పై సన్‍రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది.
అయితే.. సాయంత్రం జరిగే.. కోల్‍కతా నైట్‍రైడర్స్( కేకేఆర్), రాజస్థాన్ రాయల్స్( ఆర్ఆర్) మధ్య మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ఈ క్రమంలో కోల్‍కతా నైట్‍రైడర్స్ మరో పాయింట్ కైవసం చేసుకుని అత్యధికంగా పాయింట్స్ తో టాప్ ప్లేస్‍తో ప్లేఆఫ్స్‌లో అడుగుపెడితే .. హైదరాబాద్ రెండో స్థానానికి చేరుకుంది.
ఇక రాజస్థాన్, బెంగళూరు మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి ప్లేఆఫ్స్ చేరాయి. మిగిలిన ఆరు జట్లు ఎలిమినేట్ అయిపోయాయి.
IPL 2024 ప్లేఆఫ్‌ల పూర్తి షెడ్యూల్ ఇదే..
క్వాలిఫైయర్ 1:
కోల్‍కతా నైట్‍రైడర్స్ vs సన్‍రైజర్స్ హైదరాబాద్
మే 21 - సమయం: 7:30 PM
వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్
ఎలిమినేటర్:
రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
తేదీ: మే 22, సమయం: 7:30 PM,
వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్
క్వాలిఫైయర్ 2 :
క్వాలిఫైయర్ 1లో ఓడిన జట్టు క్వాలిఫైయర్ 2 ద్వారా ఫైనల్‌కు అర్హత సాధించడానికి మరొక అవకాశాన్ని పొందుతుంది.
క్వాలిఫైయర్ 1లో ఓడిన జట్టు vs ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు
తేదీ: మే 24, సమయం: 7:30, వేదిక: చెపాక్, చెన్నై
IPL 2024 ఫైనల్:
క్వాలిఫయర్ 1 విన్నర్ vs క్వాలిఫైయర్ 2 విన్నర్
తేదీ: మే 26, సమయం: 7:30 PM,
వేదిక: చెపాక్, చెన్నై