KKR vs SRH Highlights : హెన్రిచ్ క్లాసెన్ సూప‌ర్ షో.. కేకేఆర్ కు వ‌ణుకు పుట్టించిన హైద‌రాబాద్

By Mahesh Rajamoni  |  First Published Mar 23, 2024, 11:55 PM IST

KKR vs SRH Highlights: ఐపీఎల్ 2024లో మూడో మ్యాచ్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్, స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ల‌ప‌డ్డాయి. ఉత్కంఠ‌గా సాగిన ఈ మ్యాచ్ లో ఆండ్రీ ర‌స్సెల్, హెన్రిచ్ క్లాసెన్ లు సూప‌ర్ ఇన్నింగ్స్ ల‌తో అద‌ర‌గొట్టారు. 
 


KKR vs SRH KKR vs SRH Highlights : ఐపీఎల్ 2024లో మూడో మ్యాచ్ క్రికెట్ ల‌వ‌ర్స్ కు ఫుల్ మ‌జాను అందించింది. చివ‌రి బంతివ‌ర‌కు  ఉత్కంఠ‌గా సాగిన ఈ మ్యాచ్ లో హైద‌రాబాద్ టీమ్ కోల్ క‌తా వెన్నులో వ‌ణుకు ప‌ట్టించింది. చివ‌ర‌లో ధ‌నాధ‌న్ బ్యాటింగ్ తో హైద‌రాబాద్ టీమ్ కోల్ క‌తా బౌల‌ర్ల‌కు చెమ‌ట‌లు ప‌ట్టించింది. చివ‌రి బాల్ వ‌ర‌కు ఉత్కంఠ‌ను రేపిన ఈ మ్యాచ్ లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ పై కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ విజ‌యం సాధించింది. చివ‌రి ఓవ‌ర్ లో రెండు వికెట్లు కోల్పోవ‌డంతో నాలుగు ప‌రుగుల తేడాతో హైద‌రాబాద్ టీమ్ ఓడింది. 

దుమ్మురేపిన ఆండ్రీ ర‌స్సెల్, హెన్రిచ్ క్లాసెన్

Latest Videos

undefined

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ క‌తా టీమ్ ఆండ్రీ ర‌స్సెల్ త‌న మస్సెల్ ప‌వ‌ర్ ను చూపిస్తూ సూప‌ర్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ 200 మార్కును అందుకుంది. దీంతో ఐపీఎల్ 2024లో 200+ మార్కును అందుకున్న తొలి టీమ్ గా కేకేఆర్ నిలిచింది. ఆండ్రీ ర‌స్సెల్ సిక్స‌ర్ల మోత మోగించాడు. 16వ ఓవ‌ర్ లో మార్కాండే బౌలింగ్ వ‌రుస సిక్స‌ర్లు అదిరిపోయాయి. ఆండ్రీ ర‌స్సెల్ 64 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు. త‌న ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు, 7 సిక్స‌ర్లు బాదాడు. దీంతో కేకేఆర్ 20 ఓవ‌ర్ల‌లో కేకేఆర్ 7 వికెట్లు కోల్పోయి 207 ప‌రుగులు చేసింది. ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన ఫిలిప్ సాల్ట్ 54 ప‌రుగులు చేశాడు. 

 

It's the Dre Russ show in tonight 🎇🎆

Watch more smashing sixes with pic.twitter.com/vVPmV3xADi

— JioCinema (@JioCinema)

చివ‌ర‌లో అద‌ర‌గొట్టిన హైద‌రాబాద్.. 

209 ప‌రుగుల భారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన స‌న్ రైజ‌ర్స్ కు ఓపెన‌ర్లు మ‌యాంక్ అగ‌ర్వాల్, అభిషేక్ శ‌ర్మ‌లు శుభారంభం అందించారు. మ‌యాంక్ 32, అభిషేక్ 32 ప‌రుగులు చేసి ఔట్ అయ్యారు. రాహుల్ త్రిపాఠి, మార్క్ ర‌మ్ లు త్వ‌ర‌గానే ఔట్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే క్రీజులోకి వ‌చ్చిన హెన్రిచ్ క్లాసెన్ వికెట్లు ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌గా ఆడాడు. ఆ త‌ర్వాత వేగం పెంచి దుమ్మురేపే షాట్ల‌తో అద‌ర‌గొట్టారు. సిక్స‌ర్ల మోత మోగించాడు. 29 బంతుల్లో 63 ప‌రుగులు చేసిన క్లాసెన్ చివరి ఓవ‌ర్ లో ఔట్ కావ‌డంతో గెలుపు ముంగిట హైద‌రాబాద్ నిలిచిపోయింది. క్లాసెన్ త‌న ఇన్నింగ్స్ లో 8 సిక్స‌ర్లు బాదాడు. 

 

𝐊𝐋𝐀𝐀𝐒𝐒. IS. IN. SESSION! 🔥🔥 pic.twitter.com/HagQvrXiy5

— SunRisers Hyderabad (@SunRisers)

చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు ఉత్కంఠ‌.. 

హెన్రిజ్ క్లాసెన్ అద్భుత‌మైన ఆట‌తో 25 బంతుల్లో త‌న హాఫ్ సెంచ‌రీని పూర్తి చేసుకున్నాడు. త‌న దూకుడుతో హైద‌రాబాద్ గెలుపున‌కు ఆఖరి ఓవర్‌లో కేవలం 13 పరుగులు కావాలి. హ‌ర్షిత్ రాణా బౌలింగ్ చేయ‌డానికి వ‌చ్చాడు. తొలి బంతిని క్లాసెన్ సిక్స‌ర్ కొట్టాడు. దీంతో స‌న్ రైజ‌ర్స్ విజ‌యానికి 7 ప‌రుగులు అవ‌స‌రం. రెండో బాల్ కు ఒక ప‌రుగు వ‌చ్చింది. మూడో బంతికి భారీ షాట్ ఆడ‌బోయి ష‌బాజ్ ఔట్ అయ్యాడు. మార్కో జాన్సెన్ క్రీజులోకి వ‌చ్చి 4వ బంతికి సింగ‌ల్ తీశాడు. 5వ బంతికి క్లాసెన్ భారీ షాట్ కొట్ట‌గా సూయ‌ష్ శ‌ర్మ సూప‌ర్ క్యాచ్ ప‌ట్ట‌డంతో ఔట్ అయ్యాడు. చివ‌రి బంతికి 4 ప‌రుగులు కావాలి. కానీ క్రీజులోకి వ‌చ్చిన కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్ హైద‌రాబాద్ కు విజ‌యం అందించ‌లేక‌పోయాడు.

 

Starting the season with a win at home! ✅ pic.twitter.com/1cgaWWPrvH

— KolkataKnightRiders (@KKRiders)

PBKS VS DC : 4, 6, 4, 4, 6, 1.. హర్షల్ పటేల్ బౌలింగ్ ను దంచికొట్టిన అభిషేక్ పోరెల్.. స‌రికొత్త రికార్డు ! 

click me!