KKR vs SRH : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ (ఐపీఎల్2024) లో భాగంగా మూడో మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి. ఆండ్రీ రస్సెల్ సిక్సర్ల మోతతో ఐపీఎల్ 2024లో 200 మార్కును అందుకున్న తొలి టీమ్ గా కేకేఆర్ నిలిచింది.
KKR vs SRH - Andre Russell : ఐపీఎల్ 2024లో ఆండ్రీ రస్సెల్ తన మస్సెల్ పవర్ చూపించాడు. ధనాధన్ ఇన్నింగ్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ ఉతికిపారేశాడు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ 200 మార్కును అందుకుంది. దీంతో ఐపీఎల్ 2024లో 200+ మార్కును అందుకున్న తొలి టీమ్ గా కేకేఆర్ నిలిచింది. ఆండ్రీ రస్సెట్ సిక్సర్ల మోతతో గ్రౌండ్ ను హోరెత్తించాడు. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ (ఐపీఎల్2024) లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ లో తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన కోల్ కతా టీమ్ బ్యాటింగ్ దిగింది. ఆరంభంలో అదరగొట్టిన కేకేఆర్ ను మూడో ఓవర్ నుంచి మ్యాచ్ ను సన్ రైజర్స్ తనవైపుకు తిప్పుకుంది. కానీ, ఎప్పుడైతే ఆండ్రీ రస్సెల్ క్రీజులోకి వచ్చాడో అప్పుడే మ్యాచ్ పూర్తిగా కేకేఆర్ వైపుకు మళ్లీంది. ఆండ్రీ రస్సెల్ బ్యాటింగ్ తుఫాను లో హైదరాబాద్ బౌలింగ్ కొట్టుకుపోయింది.
PBKS vs DC : పృథ్వీ షాకు షాకిచ్చిన ఢిల్లీ.. షాయ్ హోప్ అరంగేట్రం.. నెటిజన్లు షాక్.. !
ఆండ్రీ రస్సెల్ సిక్సర్ల మోత మోగించాడు. 16వ ఓవర్ లో మార్కాండే బౌలింగ్ వరుస సిక్సర్లు అదిరిపోయాయి. గ్రౌండ్ ను సిక్సర్ల తుఫానులో ముంచెత్తాడు ఆండ్రీ రస్సెల్. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2024 సీజన్ లో తన తొలి హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మరింగత రెచ్చిపోతూ బౌండరీలు వర్షం కురిపించాడు. రస్సెల్ కు తోడుగా టీమిండియా యంగ్ స్టార్ రింకూ సింగ్ సైతం దుమ్మురేపడంతో 20 ఓవర్లలో కేకేఆర్ 7 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. ఆండ్రీ రస్సెల్ 64 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. తన ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు.
RU-𝟔𝟔𝟔 🔥 pic.twitter.com/5MdvQYZ57e
— KolkataKnightRiders (@KKRiders)
Batting carnage to start the campaign! 🔥
Onto the defence now! 👊 pic.twitter.com/qli7ymX20K