అయ్యో కేన్ మామ ఇలా ఔట‌య్యావేంది.. ! 12 ఏండ్ల‌లో ఇదే తొలిసారి.. !

By Mahesh Rajamoni  |  First Published Mar 1, 2024, 11:08 AM IST

Kane Williamson: టెస్టు క్రికెట్ లో కేన్ విలియ‌మ్స‌న్ ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. ఇటీవ‌ల స‌ఫారీల‌పై వ‌రుస‌ సెంచ‌రీల మోత  మోగించిన విలియ‌మ్స‌న్.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న న్యూజిలాండ్-ఆస్ట్రేలియా తొలి టెస్టు అనూహ్యంగా ర‌న్ ఔట్ అయ్యాడు. 
 


Kane Williamson: న్యూజిలాండ్ స్టార్ ప్లేయ‌ర్ కేన్ విలియమ్సన్ ఇటీవ‌ల టెస్టు క్రికెట్ లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. సూప‌ర్ ఇన్నింగ్స్ ల‌తో అద‌ర‌గొడుతున్నాడు. ఇటీవ‌ల మ‌గిసిన కీవీస్-సౌతాఫ్రికా టెస్టు సిరీస్ లో వ‌రుస‌గా మూడు సెంచ‌రీలు సాధించాడు. మంచి జోష్ మీదున్న కేన్ విలియ‌మ్స‌న్ అనూహ్యంగా న్యూజిలాండ్-ఆస్ట్రేలియా తొలి టెస్టులో ర‌నౌట్ అయ్యాడు.

వెల్లింగ్‌టన్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌ రెండో రోజు  అనూహ్యంగా ర‌నౌట్ అయ్యాడు. శుక్రవారం ఆసీస్ 383 పరుగులకు ఆలౌటయ్యాక.. న్యూజిలాండ్ త‌న ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 179  ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. ఈ సీజన్‌లో సూప‌ర్ ఫామ్ లో ఉన్న కేన్ విలియమ్సన్.. అసాధారణ రీతిలో ఔట్ అయ్యాడు. ఒక్క ర‌న్ కూడా చేయ‌కుండా పెవిలియ‌న్ కు చేరాడు.

Latest Videos

కేన్ విలియమ్సన్ 12 ఏళ్ల తర్వాత రనౌట్.. 

కేన్ విలియమ్సన్ ఒక్క ప‌రుగు కూడా చేయకుండానే రనౌట్ గా వెనుదిరిగాడు.  న్యూజిలాండ్-ఆస్ట్రేలియా తొలి టెస్టులో కేన్ మామ టెస్టు క్రికెట్‌లో 12 ఏళ్ల తర్వాత ర‌నౌట్ అయ్యాడు. చివరిసారిగా జనవరి 2012లో జింబాబ్వేపై నేపియర్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ర‌నౌట్ అయ్యాడు. ఇప్పుడు ఆస్ట్రేలియన్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన బంతిని మిడ్-ఆఫ్ వైపు కేన్ విలియమ్సన్ షాక్ కొట్టాడే. ఈ క్ర‌మంలోనే ప‌రుగు తీసే ప్ర‌య‌త్నంలో ఇద్ద‌రు బ్యాట‌ర్లు క్రీజులో ఒక‌రినొక‌రు ఎదురెదురుగా త‌గులుకున్నారు. విలియమ్సన్ స్టార్క్‌ని ఢీకొని అతని బ్యాట్‌ను పడవేయగా, మార్నస్ లాబుస్‌చాగ్నే నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో బాల్ ను  స్టంప్‌లను విసిరాడు. దీంతో డైరెక్టు హిట్ తో విలియ‌మ్స‌న్ ర‌నౌట్ అయ్యాడు.

టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 1000 ప‌రుగులు సాధించిన టాప్-5 భార‌త క్రికెట‌ర్లు వీరే !

 

The pressure is on New Zealand after Kane Williamson was run out - the first time in a Test Match since 2012
v Australia: 1st Test | LIVE on DUKE and TVNZ+ pic.twitter.com/S9itasfaDg

— TVNZ+ (@TVNZ)

టెస్టు క్రికెట్ లో అత్య‌ధిక సార్లు 5 వికెట్లు తీసిన టాప్-5 భార‌త బౌల‌ర్లు వీరే ! 

click me!