బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. ! టెస్టు క్రికెటర్లపై కోట్ల వర్షం ! దేశ‌వాళీ క్రికెట్ లో ఏదో జ‌రుగుతోంది?

By Mahesh Rajamoni  |  First Published Feb 29, 2024, 4:31 PM IST

BCCI master plan: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పుడు దేశ‌వాళీ క్రికెట్, రెడ్ బాల్ క్రికెట్‌కు సంబంధించి కొత్త ప్రణాళికను రూపొందించడంలో బిజీగా ఉంది. భారత ఆటగాళ్లను డొమెస్టిక్, రెడ్ బాల్ క్రికెట్ వైపు ఆకర్షించేందుకు మ్యాచ్ ఫీజులను పెంచే అంశాన్ని బీసీసీఐ పరిశీలిస్తోందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 
 


BCCI master plan: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పుడు దేశ‌వాళీ క్రికెట్, రెడ్ బాల్ క్రికెట్‌కు సంబంధించి కొత్త ప్రణాళికను రూపొందించడంలో బిజీగా ఉంది. భారత ఆటగాళ్లను డొమెస్టిక్, రెడ్ బాల్ క్రికెట్ వైపు ఆకర్షించేందుకు మ్యాచ్ ఫీజులను పెంచే అంశాన్ని బీసీసీఐ పరిశీలిస్తోందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. బీసీసీఐ 2023-24 సీజన్‌కు సంబంధించి టీమిండియా ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్ట్ జాబితాను విడుదల చేసింది. ఈసారి కాంట్రాక్ట్ జాబితాలో మొత్తం 30 మంది ఆటగాళ్లకు బీసీసీఐ చోటు కల్పించింది. అక్టోబర్ 2023 నుండి సెప్టెంబర్ 2024 వరకు ఆటగాళ్లతో ఒప్పందాలు జరిగాయి. గ్రేడ్ ఏ+లో నలుగురు, గ్రేడ్ ఏ లో ఆరుగురు, గ్రేడ్ బీలో ఐదుగురు, గ్రేడ్ సీలో గరిష్టంగా 15 మంది క్రీడాకారులు చోటు దక్కించుకున్నారు.

ఇషాన్-శ్రేయాస్ ల‌కు షాక్.. 

Latest Videos

కొత్త కాంట్రాక్టు జాబితాలో కొంతమంది ఆటగాళ్లకు ప్ర‌మోష‌న్ లభించగా, మరికొందరు ఆటగాళ్లకు షాక్ ఇచ్చింది బీసీసీఐ. స్టార్ ప్లేయ‌ర్లు శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ లు ఈ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. దేశవాళీ క్రికెట్‌లో ఆడనందుకు ఇద్దరు ఆటగాళ్లకు విష‌యంలో బీసీసీఐ క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంది. దక్షిణాఫ్రికా పర్యటనలోమానసిక అలసట కారణంగా ఇషాన్ కిష‌న్ పర్యటన మ‌ధ్య‌లోనే వ‌చ్చేశాడు. అప్పటి నుంచి ఇషాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. మరోవైపు, వెన్ను గాయం కారణంగా శ్రేయాస్ అయ్య‌ర్ రంజీ ట్రోఫీకి దూరమయ్యాడు. వీరిద్ద‌రిని బీసీసీఐ ప‌లుమార్లు హెచ్చ‌రించిన ప‌ట్టించుకోలేదు. చివ‌రి వార్నింగ్ ను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు దేశ‌వాళీ క్రికెట్ క‌నిపించారు. కానీ, బీసీసీఐ కాంట్రాక్టును కొన‌సాగించ‌కుండా షాక్ ఇచ్చింది.

ఇషాన్ కిషన్-శ్రేయాస్ అయ్యర్ లు బీసీసీఐ కాంట్రాక్టులను ఎందుకు కోల్పోయారు?

టెస్టు మ్యాచ్‌లకు బంపర్ ఫీజు.. 

దేశ‌వాళీ క్రికెట్ పై భార‌త టీమ్ లో ఆడిన త‌ర్వాత ప్లేయ‌ర్లు ఆస‌క్తి చూప‌క‌పోవ‌డంపై బీసీసీఐ గ‌రంగ‌రం అవుతోంది. ఇదే స‌మ‌యంలో ప్లేయ‌ర్లకు గుడ్ న్యూస్ చెబుతూ కీల‌క మార్పులు చేయాల‌ని చూస్తోంద‌ని ప‌లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇషాన్-అయ్యర్ ప్రవర్తన తర్వాత బీసీసీఐ టెస్ట్ మ్యాచ్‌ల ఫీజులను పెంచ‌ల‌ని నిర్ణ‌యం తీసుకుంద‌ని టాక్ న‌డుస్తోంది. దీని కోసం బీసీసీఐ ఇప్పుడు దేశ‌వాళీ క్రికెట్, రెడ్ బాల్ క్రికెట్‌కు సంబంధించి కొత్త ప్రణాళికను రూపొందించడంలో బిజీగా ఉంది. భారత ఆటగాళ్లను దేశవాళీ క్రికెట్ వైపు ఆకర్షించేందుకు మ్యాచ్ ఫీజులను కూడా పెంచే అంశాన్ని బీసీసీఐ పరిశీలిస్తోంది. అంతేకాదు టెస్టు మ్యాచ్‌లు ఆడే ఆటగాళ్లకు ఎక్కువ జీతం ఇవ్వాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. రాబోయే కాలంలో, టెస్ట్ క్రికెట్ ఆడే భారత ఆటగాళ్ల రిటైనర్‌షిప్ విలువ గణనీయంగా పెరగవచ్చని క్రికెట్ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. బీసీసీఐ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌లతో ఈ అంశంపై చర్చిస్తోంది. మూలాల ప్రకారం, టెస్ట్, దేశీయ స్థాయిలో ఆటగాళ్ల మ్యాచ్ ఫీజు/రిటైనర్‌షిప్ విలువను పెంచే ప్రతిపాదనను బోర్డు స్వీకరించింది.

టెస్టు ఆటగాళ్లకు 15 కోట్లు, రంజీ ఆటగాళ్లకు భారీగానే.. ! 

'టెస్ట్ మ్యాచ్, ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఫీజులను మూడు రెట్లు పెంచాలని సిఫార్సులు అందాయి. ఒక ఆటగాడు మొత్తం రంజీ ట్రోఫీ ఆడితే, అతను దాదాపు రూ. 75 లక్షలు అందుకుంటాడు. ఇది సగటు ఐపీఎల్ కాంట్రాక్ట్‌కు సమానం. 'ఒక ఆటగాడు ఒక సంవత్సరంలో అన్ని టెస్ట్ మ్యాచ్‌లు ఆడితే, అతను ఏదైనా ప్రధాన ఐపీఎల్ కాంట్రాక్ట్‌తో సమానమైన రూ. 15 కోట్లు సంపాదించగలడని కూడా సూచించబడింది' అని సంబంధిత మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా, ప్రస్తుతం భారత ఆటగాడు ఒక సీజన్‌లో మొత్తం 10 రంజీ మ్యాచ్‌లు ఆడితే దాదాపు రూ.20 లక్షలు సంపాదించవచ్చు. ఐపీఎల్ వేలంలో ఆటగాడి బేస్ ధర రూ.20 లక్షలకు తక్కువ కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు దేశవాళీ క్రికెట్‌కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వనక్కర్లేదు. ఈ క్ర‌మంలోనే బీసీసీఐ మార్పుల‌కు స్వీకారం చుట్టింద‌ని స‌మాచారం.

IND VS ENG : స్టార్ ప్లేయ‌ర్ దూరం.. ధ‌ర్మ‌శాల‌లో ఇంగ్లాండ్ తో త‌ల‌ప‌డే భార‌త జ‌ట్టు ఇదే..

click me!