Virat Kohli: వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ లకు విరాట్ కోహ్లీ దూరంగా ఉన్నాడు. అయితే, అయితే, ఇప్పుడు విరాట్ కోహ్లీకి బిగ్ షాక్ తగిలింది.
Big shock to Virat Kohli: ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ లకు విరాట్ కోహ్లి టీమ్ దూరంగా ఉన్నాడు. ఇప్పుడు కోహ్లీ బిగ్ షాక్ తగిలింది. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ విరాట్ కోహ్లీని అధిగమించాడు. టెస్టుల్లో వరుస సెంచరీలతో అదరగొడుతూ టిమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని కేన్ మామ వెనక్కి నెట్టాడు. మరో విశేషమేమిటంటే కేన్ విలియమ్సన్ గత 9 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 5 సెంచరీలు సాధించాడు.
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ జరుగుతుండగా, న్యూజిలాండ్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య కూడా ఆదివారం నుంచి రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభమైంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ దూకుడుగా ఆడుతూ పరుగుల వరద పారించింది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, యంగ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర సెంచరీలతో అదరగొట్టారు.
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్
కేన్ విలియమ్సన్ టెస్టుల్లో 30వ సెంచరీ నమోదు చేశాడు. దీంతో టెస్టుల్లో అత్యధిక సెంచరీలు బాదిన ప్లేయర్ల లిస్టులో విరాట్ కోహ్లీని కేన్ విలియమ్సన్ అధిగమించాడు. మరోవైపు టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన టాప్ ప్లేయర్ల జాబితాలో (ప్రస్తుతం క్రికెట్ లో కొనసాగుతున్న వారిలో) విరాట్ కోహ్లీ అట్టడుగు స్థానానికి చేరుకున్నాడు. టెస్టుల్లో విరాట్ ఇప్పటివరకు 29 సెంచరీలు చేశాడు.
టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు*
టెస్టుల్లో అత్యంత వేగంగా 30 సెంచరీలు చేసిన ఆటగాళ్లు
రచిన్ రవీంద్రకు తొలి టెస్టు సెంచరీ
2023 ప్రపంచకప్‌లో సూపర్ బ్యాటింగ్ తో అదరగొట్టి తనదైన ముద్ర వేసిన న్యూజిలాండ్ యంగ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తన టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీని సాధించాడు. రచిన్ రవీంద్ర 189 బంతులు ఎదుర్కొని 100 పరుగుల మార్కును చేరుకున్నాడు. తన ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు.
100 ఏండ్లలో ఒకే ఒక్కడు.. టెస్టు క్రికెట్ లో బుమ్రా సరికొత్త రికార్డు