100 ఏండ్లలో ఒకే ఒక్క‌డు.. టెస్టు క్రికెట్ లో బుమ్రా స‌రికొత్త రికార్డు

By Mahesh Rajamoni  |  First Published Feb 4, 2024, 10:10 AM IST

India vs England: ఇంగ్లాండ్ తో జ‌రుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ బౌల‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో అద‌రగొట్టి  గ‌త 100 ఏండ్ల‌లో ఒకే ఒక్క ప్లేయ‌ర్ గా స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. వైజాగ్ టెస్టులో 6 వికెట్లు తీసుకున్న త‌ర్వాత టెస్టుల‌లో 150 + వికెట్లు తీసిన బౌలర్, బెస్ట్ బౌలింగ్ యావ‌రేజ్ తో రికార్డు సృష్టించాడు. 
 


India vs England: విశాఖ‌ప‌ట్నం వేదికగా జరుగుతున్న భార‌త్-ఇంగ్లాండ్ రెండో టెస్టులో భార‌త బౌల‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా అద్భుత‌మైన బౌలింగ్ తో రాణించాడు. బుమ్రా దెబ్బకు ఇంగ్లాండ్  తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ చేయ‌కుండా కుప్పకూలింది. యార్క‌ర్లలో ఇంగ్లాండ్ వెన్నువిరుస్తూ కీల‌క ఆట‌గాళ్ల‌ను ఔట్ చేశాడు. బుమ్రా ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లు తీసుకున్నాడు. ఈ క్ర‌మంలోనే స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు.

హైద‌రాబాద్ లో జ‌రిగిన తొలి టెస్టులో అద్భుతమైన ఆటతో సెంచరీ కొట్టిన ఇంగ్లాండ్ ప్లేయర్ ఓలీ పోప్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు బుమ్రా. అలాగే, జోరూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, టామ్ హార్ట్లీ, జేమ్స్ అండర్సన్ లను ఔట్ చేసి ఇంగ్లాండ్ ను భారీ స్కోర్ చేయకుండా దెబ్బకొట్టాడు. బుమ్రా మొత్తం 6 వికెట్లు తీసుకోవ‌డంతో టెస్టు క్రికెట్ లో  150 + వికెట్లు తీసిన బౌల‌ర్ గా రికార్డు సృష్టించాడు. అలాగే, అత్యంత వేగంగా 150 + వికెట్లు తీసిన టాప్-5 భార‌త బౌల‌ర్ల లిస్టులో చోటు సంపాదించాడు.

Latest Videos

ఎలా ఆడేది గురూ నువ్వు ఇలా బాల్ వేస్తే.. బుమ్రా బౌలింగ్ తో బెన్ స్టోక్స్

బుమ్రా ఈ మ్యాచ్ లో 6 వికెట్లు తీసుకోవ‌డంతో గ‌త 100 ఏండ్ల‌లో 150 + వికెట్లు, బెస్టు బౌలింగ్ గ‌ణాంకాలు న‌మోదుచేసిన ప్లేయ‌ర్ గా చ‌రిత్ర సృష్టించాడు. 1914 త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కు టెస్టు క్రికెట్ లో 150 + వికెట్లు తీసుకోవ‌డంతో పాటు బెస్టు బౌలింగ్ యావ‌రేజ్ (20.28) ను న‌మోదుచేసిన ఒకేఒక్క క్రికెట‌ర్ గా చ‌రిత్ర సృష్టించాడు జ‌స్ప్రీత్ బుమ్రా. అయితే, టెస్టు క్రికెట్ లో 150 + వికెట్లు తీసుకోవ‌డంతో పాటు బెస్టు యావ‌రేజ్ న‌మోదులో ఇంగ్లాండ్ ప్లేయ‌ర్ సిడ్నీ బ‌ర్న్స్ టాప్ లో ఉన్నాడు. సిడ్నీ బ‌ర్న్స్ 1901-1914 మ‌ధ్య కాలంలో టెస్టు క్రికెట్ లో 27 టెస్టుల్లోనే 189 వికెట్లు తీయ‌డంతో పాటు 16.43 యావ‌రేజ్ ను న‌మోదుచేశాడు. 
ఫ్లాప్ షో.. అవ‌కాశాల కొమ్మ‌ల‌ను న‌రికేసుకుంటున్న శుభ్‌మన్ గిల్.. !

 

Innings Break!

England are all-out for 2⃣5⃣3⃣

6⃣ wickets for vice-captain
3⃣ wickets for
1⃣ wicket for

Scorecard ▶️ https://t.co/X85JZGt0EV | | pic.twitter.com/wb4s7EXIuu

— BCCI (@BCCI)
click me!