Jasprit Bumrah: బుమ్రా బౌలింగ్ విధ్వంసం.. తన సక్సెస్ సీక్రెట్ ఏంటో చెప్పేశాడు!

By Rajesh Karampoori  |  First Published Feb 4, 2024, 6:43 AM IST

Jasprit Bumrah: విశాఖపట్నంలో జరుగుతున్న రెండో టెస్ట్ లో పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (6/45) స్వింగ్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థి వెన్నువిరిచాడు. దీంతో టీమిండియా ఇంగ్లాండుపై ఆధిపత్యం చేలాయించింది. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇంగ్లాండ్ బ్యాటర్లపై వ్యూహాత్మకంగా ఎలా బౌలింగ్ చేశాడో, తన ప్లాన్ ఎలా వర్కవుట్ అయ్యింది వివరించాడు. 


Jasprit Bumrah : విశాఖపట్నంలో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు ఇంగ్లాండుపై టీమిండియా ఆధిపత్యం లభించింది. రెండో రోజు మ్యాచ్ లో భారత్ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా స్వింగ్‌ కళ్లు చెదిరే యార్కర్లకు తోడు అవుట్‌ స్వింగ్‌, ఇన్‌స్వింగ్‌తో ఇంగ్లండ్‌ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించాడు. భాగస్వామ్యం ఏర్పడిన ప్రతిసారీ కెప్టెన్‌ రోహిత్‌ బంతిని బుమ్రాకు అందించాడు. అందుకు తగ్గట్టే కెప్టెన్‌ నమ్మకాన్ని బుమ్రా నిలబెట్టాడు.

ఇలా ఏకంగా 6 వికెట్లు తీసి.. ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. ఈ తరుణంలో బూమ్రా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన తొలి బౌలర్ గా నిలిచారు. బూమ్రా అద్భుత ఆటతీరుతో ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకే కుప్పకూలడంతో ఆతిథ్య జట్టు 143 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. జో రూట్, జానీ బెయిర్‌స్టో, ఆలీ పోప్‌ల వికెట్లు పడగొట్టిన తీరు ఆసక్తికరంగా మారింది. బూమ్రా  ఇన్‌స్వింగర్ యార్కర్‌తో పోప్‌ను బౌలింగ్ చేస్తున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Latest Videos

మ్యాచ్ అనంతరం మీడియాతో బుమ్రా మాట్లాడాడు.ప్రత్యేకమైన వ్యూహాలతో బౌలింగ్ చేశాననీ, ముఖ్యంగా ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్ బంతులను సంధించాను. వీటితో పాటు అతిముఖ్యమైన రివర్స్ స్వింగ్ లు, యార్కర్లను వేశాను. అవి వర్కవుట్ అయి, వికెట్లను తీసుకువచ్చాయని అన్నాడు. బ్యాటర్లు తన నుంచి ఇన్ స్వింగ్ లు ఎక్కువ ఆశిస్తున్నారని, అందుకనే ఒకటి ఇన్ స్వింగ్ వేస్తే.. మరొకటి రివర్స్ స్వింగ్ వేశానని, ఆ తర్వాత యార్కర్ బంతులను సంధించానని అన్నాడు. ఇలా ఓవర్ ఓవర్ కి వినూత్నంగా ప్రయత్నిస్తూ.. వికెట్లను పడగొట్టానని అన్నారు.

ఇండియన్ పిచ్ లపై రాణించాలంటే రివర్స్ స్వింగ్ బంతులను సంధించడం నేర్చుకోవాలని, రివర్స్ స్వింగ్ బంతులను ఎదుర్కొవడంలో బ్యాట్స్ మెన్స్ ఇబ్బంది పడుతారని తెలిపాడు. తన చిన్నతనం నుంచి ప్రపంచంలోని ప్రముఖ బౌలర్ల యాక్షన్, వారు బ్యాటర్లను అవుట్ చేసే తీరు, బాల్ డెలివరీ మొదలైన అంశాలను క్షుణంగా పరిశీలిస్తూ పెరిగానని తెలిపారు. వినూత్నంగా బౌలింగ్ వేయాడానికి రాత్రీ పగలు ప్రాక్టిస్ చేశానని తెలిపారు. కష్టపడితే ఫలితం దానంతటదే వస్తుందని నమ్మేవారిలో తాను మొదటి వరుసలో ఉంటానని వెల్లడించారు. 

ఒకే ఇన్నింగ్స్ లో  6 వికెట్ల పడగొట్టడం ఎలా ఫీల్ అవుతున్నారని ప్రశ్నించగా.. తన ప్రదర్శన కారణంగా మనసెంతో ఉత్సాహంగా ఉందనీ, కాకపోతే ఈ రికార్డ్స్ ను తలకి ఎక్కించుకోకూడదని అన్నాడు. తన రికార్డ్స్ ని పట్టించుకోననీ, ఒకవేళ రికార్డుల కోసం ఆడితే.. అనవసర  ఒత్తిడి పెరుగుతుందనీ, అది ఆటపై ప్రభావం చూపిస్తుందని అన్నాడు. అందుకనే అలాంటి వాటికి తాను దూరంగా ఉంటానని తెలిపాడు. ప్రతి మ్యాచ్ లో వందకి, రెండు వందల శాతం కష్టపడతాననీ, అయితే అన్నివేళలా ఫలితం రాదని అన్నాడు.

click me!