ఆ క్రికెటర్ బార్యపై కామెంట్ చేశా: ఇర్ఫాన్ పఠాన్

Published : Jan 05, 2020, 08:27 PM IST
ఆ క్రికెటర్ బార్యపై కామెంట్ చేశా: ఇర్ఫాన్ పఠాన్

సారాంశం

తాను కుమార సంగక్కర భార్యపై కామెంట్ చేసిన విషయాన్ని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ఇర్ఫాన్ పఠాన్ గుర్తు చేసుకున్నాడు. కుమార సంగక్కర తనపై వ్యక్తిగత దూషణకు దిగాడని, తాను కూడా వెనక్కి తగ్గలేదని ఆయన చెప్పాడు.

న్యూఢిల్లీ: టీమిండియా ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత తన మనసులోని మాటలను ఒక్కటొక్కటే బయటపెడుతున్నాడు. జట్టులో ఒక్క వెలుగు వెలిగి దూరమైన ఇర్ఫాన్ పఠాన్ శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కరను స్లెడ్జ్ చేసిన విషయాన్ని బయటపెట్టాడు. 

ఢిల్లీలో శ్రీలంకతో జరిగిన ఓ టెస్టు మ్యాచులో కుమార సంగక్కరను స్లెడ్జ్ చేసే క్రామంలో ఆయన భార్య గురించి కూడా కామెంట్ చేయాల్సి వచ్చిందని ఇర్ఫాన్ పఠాన్ చెప్పాడు. 

Also Read: రిటైర్మెంట్ తర్వాత అదొక్కటే విచారం: ఇర్ఫాన్ పఠాన్

ఆ మ్యాచు రెండో ఇన్నింగ్సులో తాను93 పరుగులు చేశానని, వీరేంద్ర సెహ్వాగ్ గాయపడడంతో తాను బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు వచ్చానని, ఆ మ్యాచును శ్రీలంక ఓడిపోతుందని సంగక్కరకు తెలుసునని, ఆ క్రమంలో తనపై స్లెడ్జింగ్ కు దిగాడని ఆయన చెప్పాడు.

తనపై వ్యక్తిగత దూషణ చేశాడని, తాను కూడా ధీటుగా వ్యక్తిగత దూషణకు దిగానని, ప్రత్యేకంగా అతని భార్యపై వ్యాఖ్యలు చేశానని, అతను తల్లిదండ్రుల గురించి వ్యాఖ్యలు చేశాడని, ఇది తమ ఇద్దరి మధ్య అగ్గిని రాజేసిందని ఇర్ఫాన్ చెప్పాడు. 

Also Read: అంతర్జాతీయ క్రికెట్ కు ఇర్ఫాన్ పఠాన్ గుడ్ బై.

ఆ మ్యాచు తర్వాత తామిద్దరం అంత సంతోషంగా లేమని, ఒకరి ముఖం ఒకరం చూసుకోలేదని చెప్పాడు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతూ ఇర్ఫాన్ పఠాన్ శనివారంనాడు ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు