రిటైర్మెంట్ తర్వాత అదొక్కటే విచారం: ఇర్ఫాన్ పఠాన్

By telugu teamFirst Published Jan 5, 2020, 5:07 PM IST
Highlights

రిటైర్మెంట్ తర్వాత తనకు కలిగే విచారం ఒక్కటేనని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. చాలా మంది అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టే వయస్సులో తాను కెరీర్ ను ముగించాల్సి వచ్చిందని ఆయన అన్నాడు.

హైదరాబాద్: రిటైర్మెంట్ తర్వాత తనకు మిగిలిని విచారం ఒక్కటేనని, అది కొంత మంది అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెడుతున్న వయస్సులో తాను కెరీర్ ను ముగించాల్సి వచ్చిందని, అదే విచారం ఉందని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతూ శనివారం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. 

కొంత మంది 27- 28 ఏళ్ల వయస్సులో తమ కెరీర్ ను ప్రారంభించి 35 ఏళ్ల వయస్సు వరకు ఆడుతున్నారని, 301 వికెట్లు తీసుకున్న తాను 27 ఏళ్ల వయస్సులోనే కెరీర్ ను ముగించాల్సి వచ్చిందని, అదే తన విచారమని ఆయన అన్నాడు. 

Also Read: అంతర్జాతీయ క్రికెట్ కు ఇర్ఫాన్ పఠాన్ గుడ్ బై

ప్రస్తుతం 35 ఏళ్ల వయస్సు గల ఇర్ఫాన్ పఠాన్ చివరి మ్యాచ్ ఆడి ఏడేళ్లకు పైగా సమయం గడిచిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. 2016లోనే తాను ఇండియాకు తిరిగి ఆడడం సాధ్యం కాదనిపించిందని చెప్పాడు. 

27 ఏళ్ల వయస్సులో పతాక స్థాయిలో ఉన్న తన కెరీర్ ఉందని, మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశించానని, కానీ కారణాలు తెలియదు కానీ అది జరగలేదని, అయితే, దానిపై ఫిర్యాదులేమీ లేవని, వెనక్కి తిరిగి చూసుకుంటే మాత్రం విచారం కలుగుతుందని ఆయన అన్నాడు. 

click me!