ప్రముఖ క్రికెటర్ కెఎల్ రాహుల్ ఇంట పండగ వాతావరణం నెలకొంది. ఆయన తండ్రి అయ్యాడు... భార్య అతియా ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
ప్రముఖ క్రికెటర్ కెఎల్ రాహుల్ తండ్రి అయ్యాడు. అతడి భార్య అతియా శెట్టి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వీరి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ విషయాన్ని స్వయంగా అతియా శెట్టి ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.
బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి కూతురే ఈ అతియా శెట్టి. ఈమె యువ క్రికెటర్ కెఎల్ రాహుల్ ప్రేమించుకున్నారు... ఇరుకుటుంబాల పెద్దల అంగీకారంతో ఇద్దరు పెళ్లిచేసుకున్నారు. 2023 లో వీరి వివాహం జరిగింది. వీరి వైవాహిక బంధానికి ప్రతిఫలంగా ఇప్పుడు ఆడబిడ్డ జన్మించింది.
విశాఖపట్నం వేదికగా డిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జాయింట్స్ మధ్య విశాఖపట్నంలో మ్యాచ్ జరుగుతోంది. అయితే డెలివరీ సమయంలో భార్య దగ్గర ఉండేందుకు కెఎల్ రాహుల్ ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. ఇలా తండ్రిగా మారే మధుర క్షణాలకోసం ఎంతో ఇష్టమైన క్రికెట్ కు కెఎల్ రాహుల్ కాస్త దూరంకావాల్సి వచ్చింది. అయితే త్వరలోనే ఆయన డిల్లీ టీంలో చేరనున్నారు.