IPL 2025 CSK vs MI: మెరుపును మించిన వేగం.. సెకను కంటే తక్కువ సమయంలో ధోని సూప‌ర్ స్టంపింగ్

IPL 2025 CSK vs MI: ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ మాజీ కెప్టెన్, వికెట్ కీప‌ర్ బ్యాట్స్ మెన్ ఎంఎస్ ధోని మెరుపుకంటే వేగంగా స్టంపింగ్ చేసి సూర్య‌కుమార్ యాద‌వ్ కు షాకిచ్చాడు.
 

IPL 2025 CSK vs MI: Stumping faster than lightning... Surya was shock, MS Dhoni blew away the stumps in less than a second in telugu

IPL 2025 CSK vs MI:  భార‌త లెజెండ‌రీ ప్లేయ‌ర్, చెన్నై సూప‌ర్ కింగ్స్ వికెట్ కీప‌ర్ బ్యాట్స్ మెన్ మ‌హేంద్ర సింగ్ ధోని మరోసారి తన అద్భుతమైన వికెట్ కీపింగ్ సామర్థ్యంతో అంద‌రినీ ఆశ్చర్యపరిచాడు. 43 ఏళ్ల వయస్సులో కూడా ధోనీ మెరుపు కంటే వేగంగా స్టంపింగ్ చేసి ఔరా అనిపించాడు. ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను 0.12 సెకన్లలో స్టంప్ చేసి త‌న వికెట్ కీప‌ర్ ప‌వ‌ర్ ను చూపించాడు. సూర్య‌కు షాకిచ్చాడు. ఇది ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మూడో ఐపీఎల్ 2025 మ్యాచ్ సంద‌ర్భంగా జ‌రిగింది. 

ఈ సంఘటన 10.3వ ఓవర్‌లో నూర్ అహ్మద్ వేసిన బంతితో జరిగింది. గూగ్లీ బంతిని ఎదుర్కొంటూ సూర్యకుమార్ క్రీజు నుండి బయటకు వచ్చి బిగ్ షాట్ ఆడ‌టానికి ప్ర‌య‌త్నించాడు. అయితే, బంతిని బ్యాట్ మిస్ అయింది. వెంట‌నే మెరుపు కంటే వేగంగా ధోని బాల్ ను అందుకుని స్టంపింగ్ చేశాడు. ఈ అద్భుతమైన స్టంపింగ్ ను ధోని కేవలం 0.12 సెకన్లలో పూర్తి చేశాడు.  ప్ర‌స్తుతం స్టంపింగ్ వీడియో దృశ్యాలు వైర‌ల్ గా మారాయి. 

Latest Videos

 

 

🚄: I am fast
✈: I am faster
MSD: Hold my gloves 😎

Nostalgia alert as a young flashes the bails off to send packing!

FACT: MSD affected the stumping in 0.12 secs! 😮‍💨

Watch LIVE action: https://t.co/uN7zJIUsn1 👉 , LIVE NOW on… pic.twitter.com/oRzRt3XUvC

— Star Sports (@StarSportsIndia)

 

ఈ స్టంపింగ్ త‌ర్వాత ముంబై పెద్ద‌గా ప‌రుగులు చేయ‌లేక‌పోయింది. 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి155 పరుగులు చేసింది. నూర్ అహ్మద్ (4/18), ఖలీల్ అహ్మద్ (3/29) సూప‌ర్ బౌలింగ్ తో ముంబై జట్టును ప‌రుగులు చేయ‌కుండా కట్టడి చేశారు. 156 ప‌రుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన చెన్నై టీమ్ కు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ర‌చిన్ ర‌వీంద్ర హాఫ్ సెంచ‌రీ అన్నింగ్స్ ల‌తో ఈజీగానే టార్గెట్ ను అందుకుంది. 


 

Indeed an Absolute Cinema at Anbuden! ✋🦁🤚 🦁💛 pic.twitter.com/yutbRIkx8z

— Chennai Super Kings (@ChennaiIPL)

 

IPL 2025 CSK vs MI: ఐపీఎల్ లో రోహిత్ శ‌ర్మ చెత్త రికార్డు

 

 

vuukle one pixel image
click me!