IPL 2025, RR vs SRH: జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత చెత్త బౌలింగ్ రికార్డును నమోదుచేశాడు. ఒకే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చాడు.
IPL 2025, RR vs SRH Jofra Archer: ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పేసర్ జోఫ్రా ఆర్చర్ చెత్త రికార్డును నమోదుచేశాడు. తన నాలుగు ఓవర్ల బౌలింగ్ లో రికార్డు స్థాయిలో 76 పరుగులు ఇచ్చాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన స్పెల్ ఉన్న బౌలర్‌గా చెత్త రికార్డు సాధించాడు. ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 73 పరుగులు ఇచ్చిన గుజరాత్ టైటాన్స్‌కు చెందిన మోహిత్ శర్మ చెత్త బౌలింగ్ రికార్డును అధిగమించాడు.
ఆర్చర్ బౌలింగ్ ను దంచికొట్టిన హైదరాబాద్ బ్యాటర్లు
తన వేగవంతమైన బౌలింగ్ కు, పదునైన బౌన్స్ తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టే సామర్థ్యంతో గుర్తింపు పొందిన ఆర్చర్ బౌలింగ్ ను హైదరాబాద్ బ్యాటర్లు ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ లు దంచికొట్టారు. ఇంగ్లీష్ పేసర్ తన స్పెల్ లోని చాలా బైండరీలు సమర్పించుకున్నాడు.
ఐపీఎల్ చెత్త బౌలింగ్ రికార్డులు
ఐపీఎల్ లో చెత్త బౌలింగ్ రికార్డు అంతకుముందు మోహిత్ శర్మ పేరిట ఉంది. 2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్నప్పుడు నాలుగు ఓవర్లలో 73 పరుగులు ఇచ్చాడు. ఆర్చర్ స్పెల్ ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. అతను ఏకంగా 76 పరుగులు ఇచ్చాడు.
0/76 – జోఫ్రా ఆర్చర్ vs RR, 2025
0/73 – మోహిత్ శర్మ vs DC, 2024
0/70 – బాసిల్ థంపి vs RCB, 2018
0/69 – యష్ దయాల్ vs KKR, 2023
1/68 – రీస్ టోప్లీ vs MI, 2024
1/68 – ల్యూక్ వుడ్ vs DC, 2024