IPL 2024, SRH vs RR: ఐపీఎల్ 2024 ఫైనల్ పోరులో కేకేఆర్ తో తలపడటానికి క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు ఇంటిముఖం పడుతుంది.
Rajasthan Royals vs Sunrisers Hyderabad : ఐపీఎల్2024 క్వాలిఫయర్-2 మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్లు తలపడనున్నాయి. ఫైనల్ పోరులో రెండో బెర్తు కోసం శుక్రవారం సాయంత్రం 7:30 గంటలకు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. గెలిచిన గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది. ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ శుక్రవారం (మే 24) ఐపీఎల్ 2024 రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్ ఓడించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఇదే సమయంలో గెలుపై ధీమాతో ఉంది రాజస్థాన్.
ఇద్దరు మాజీ ఛాంపియన్ల మధ్య చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ ఇప్పటికే ఉత్కంఠను రేపుతోంది. శుక్రవారం జరిగే మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు ఆదివారం (మే 26) జరిగే ఐపీఎల్ 2024 ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడుతుంది. బుధవారం (మే 22) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ నాలుగు వికెట్ల తేడాతో ఆర్సీబీపై గెలిచింది. కేకేఆర్ తో జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఓడిపోయిన తర్వాత ఎస్ఆర్హెచ్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్ లో ఆర్ఆర్ తో పోటీ పడుతోంది.
undefined
పిచ్ రిపోర్ట్ ఏం చెబుతోంది?
రెండో క్వాలిఫయర్ మ్యాచ్ చెపాక్ స్టేడియంలో జరుగుతుంది, ఇక్కడ మే 12న జరిగిన చివరి మ్యాచ్‌లో సీఎస్కేపై మొదట బ్యాటింగ్ చేసిన రాయల్స్ 141 పరుగులు మాత్రమే చేయగలిగింది. చెన్నైలోని వికెట్ గత సంవత్సరాలతో పోలిస్తే 2024లో చాలా భిన్నంగా ఉంది. మూడు మ్యాచ్‌లలో సీఎస్కే 200 కంటే ఎక్కువ పరుగులు చేయగలిగింది, అయితే కొన్ని సందర్భాల్లో, వికెట్ చాలా నెమ్మదిగా ఉండటం కూడా చూడవచ్చు. కేకేఆర్, ఆర్ఆర్ 140 పరుగులు చేయడానికి కూడా ఇబ్బందులు పడ్డాయి.
వర్ష సూచనలు ఉన్నాయా? వాతావరణ నివేదిక ఏం చెబుతోంది?
అక్యూవెదర్ సూచన ప్రకారం, శుక్రవారం (మే 24) చెన్నైలో ఉష్ణోగ్రత 32 నుండి 33 డిగ్రీల సెల్సియస్‌లో ఉంటుంది. ఈ మ్యాచ్‌లో తమిళనాడు రాజధాని నగరంలో వర్షం పడే అవకాశాలు దాదాపు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే, మ్యాచ్ జరిగే సమయంలో మేఘావృతమైన వాతావరణం ఉండవచ్చు.
హైదరాబాద్ - రాజస్థాన్ గత రికార్డులు ఎలా ఉన్నాయి..?
రెండు జట్లు ఆడిన మొత్తం మ్యాచ్‌లు: 19
హైదరాబాద్ గెలిచినవి : 10
రాజస్థాన్ గెలిచినవి : 9
ఫలితం తేలనివి : 0
సన్ రైజర్స్ vs రాయల్స్ మ్యాచ్ ప్రిడిక్షన్
శుక్రవారం (మే 24) చెన్నైలో రాజస్థాన్ రాయల్స్ - సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య చాలా గట్టి పోటీ ఉంటుందని అంచనాలు చెబుతున్నాయి. ఇందులో విజేతను అంచనా వేయడం కష్టం. రెండు టీమ్ లలో బలమైన బ్యాటర్లు, బౌలర్లు ఉన్నారు. రెండు జట్లు ఇప్పటివరకు మెరుగైన ప్రదర్శనతో ప్లేఆఫ్ రేసు నుంచి ముందుకు సాగాయి. కానీ, రెండు జట్ల ప్రస్తుత ఫామ్, మొత్తం స్క్వాడ్ బ్యాలెన్స్‌ను పరిశీలిస్తే, మెన్ ఇన్ ఆరెంజ్‌కి మెన్ ఇన్ పింక్ కంటే కొంచెం గెలుపు అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇరు జట్ల ప్లేయింగ్ 11 అంచనాలు
హైదరాబాద్ : ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, విజయకాంత్ వియాస్కాంత్, టి నటరాజన్
ఇంపాక్టు ప్లేయర్లు : సంవీర్ సింగ్/ఉమ్రాన్ మాలిక్
రాజస్థాన్ : టామ్ కోహ్లర్-కాడ్మోర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ. యుజ్వేంద్ర చాహల్
ఇంపాక్టు ప్లేయర్లు : షిమ్రోన్ హెట్మెయర్/నాండ్రే బర్గర్