Latest Videos

MS Dhoni : నాలోని భయం, ఒత్తిడితోనే ఆ నిర్ణయాలు తీసుకున్నా... ధోని ఇలా అన్నాడేంటి భ‌య్యా.. !

By Mahesh RajamoniFirst Published May 24, 2024, 3:09 PM IST
Highlights

MS Dhoni : రాబోయే ఐపీఎల్ 2025 సీజ‌న్ లో ఎంఎస్ ధోని ఆడ‌తాడా?  లేదా? అనే సందేహాల మ‌ధ్య చెన్నై సూపర్ కింగ్స్ ఓన‌ర్ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి. ఇదే స‌మ‌యంలో ధోని సైతం త‌న భ‌యం గురించిన కామెంట్స్ నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. 
 

MS Dhoni : మహేంద్ర సింగ్ ధోని టీమిండియాను మూడు ఫార్మాట్ ల‌లో ఛాంపియ‌న్ గా నిలిపిన భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్. అలాగే, ఐపీఎల్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ కు ఐదు టైటిళ్లు అందించిన గొప్ప కెప్టెన్. మిస్ట‌ర్ కూల్ గా పేరొందిన ఎంఎస్ ధోని ఎలాంటి క్లిష్ట స‌మ‌యంలోనైనా కెప్టెన్ గా నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో మంచి గుర్తించి సాధించాడు. ఎంత‌ ఒత్తిడిలో ఉన్నా ప్రశాంతంగా ఉంటూ మంచి నిర్ణయాలు తీసుకుంటాడు. "క్లిష్ట సమయాల్లో ధోని కంటే మెరుగైన నిర్ణయాలు ఎవరూ తీసుకోలేరు. ఒత్తిడి సమయంలో అతను ఒంటరిగా విజయం సాధించగలడు, అతను నిజంగా నిర్భయుడు.. భయం లేకుండా ఆడగలడు " అని ధోని అభిమానులతో క్రికెట్ విశ్లేష‌కులు అనేక సంద‌ర్భాల్లో పేర్కొన్నాడు.

ఎందరో హైక్లాస్ బౌలర్లకు భయం పుట్టించిన ఎంఎస్ ధోనీ.. తాను కూడా మ్యాచ్ జ‌రుగుతుండ‌గా నిత్యం భ‌య‌ప‌డ‌తానంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. త‌న భయం ఎలాంటి సంద‌ర్భాల్లో ఉంటుందో వివ‌రిస్తూ దాని ప్రాముఖ్యత గురించి మాట్లాడాడు.. తాను కూడా భయానికి గురయ్యే అవకాశం ఉందనీ, ఆ భయమే తనను తప్పు నిర్ణయాలు తీసుకోకుండా నిరోధించి, నిర్లక్ష్యపు చర్యలకు పాల్పడకుండా విజయం వైపు న‌డిపించిందని తెలిపారు. త‌న భ‌య‌మే త‌న విజ‌యానికి తొలి మెట్టు అని ఎంఎస్ ధోని పేర్కొన్నాడు.

SRH vs RR: క్వాలిఫయర్-2 ను వర్షం దెబ్బ‌కొడితే ఐపీఎల్ ఫైన‌ల్ కు వెళ్లేది ఎవ‌రు?

చెన్నై సూపర్ సింగ్స్ టీమ్ విడుదల చేసిన ఒక‌ వీడియోలో ధోనీ మాట్లాడుతూ... "జీవితంలో భయం చాలా ముఖ్యం. ఆ భయం ఎప్పుడూ ఉండాలి. బహుశా నాకు భయం లేకపోతే, నేను ఎప్పుడూ ధైర్యంగా ఉండను. నాకు భయం.. ఒత్తిడి చాలా ముఖ్యమైనవి ఎందుకంటే అవి విషయాలు ఆలోచించడానికి, సరైన నిర్ణయం తీసుకోవడానికి నాకు చాలా సహాయపడతాయని" ధోని చెప్పాడు. అలాగే, "నేను నిర్భయుడిని అని చాలా మంది అంటారు. కానీ నేను అలా కాదు. నిర్భయంగా ఉంటే బాధ్యతారహితంగా వ్యవహరించడం ఖాయం. నాకు అస్సలు భయం లేకపోతే, నేను ప్రాపంచిక విషయాలకు కూడా విలువ ఇవ్వను. ఆ స్థిరత్వం మీరు ఎప్పుడు రోడ్డుపై నడుస్తున్నారో.. ఎప్పుడు బిగుతుగా నడుస్తున్నారో మీకు ఎప్పటికీ తెలియదు. కాబట్టి ఒక వ్యక్తి అభివృద్ధికి ఒత్తిడి, భయం ఎల్లప్పుడూ ముఖ్యమని నేను భావిస్తున్నాను" అని ధోని చెప్పాడు.

 

When Thala Speaks, we listen! 🗣️💛

Full video 🔗 https://t.co/RxWb48Dyca pic.twitter.com/5XV7B0veTi

— Chennai Super Kings (@ChennaiIPL)

 

రెండు జ‌ట్ల‌కు చావోరేవో.. టాస్ కీల‌కం.. హైదరాబాద్‌కు అడ్వాంటేజ్ ఉందా.. !

click me!