Latest Videos

IPL 2024: 17 ఏళ్ల‌లో మూడోసారి ఇలా ఐపీఎల్ ఫైన‌ల్...

By Mahesh RajamoniFirst Published May 26, 2024, 6:00 PM IST
Highlights

IPL 2024 : ఐపీఎల్ 2024 ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి.  శ్రేయాస్ అయ్య‌ర్, ప్యాట్ క‌మ్మిన్స్ ఇద్దరూ కెప్టెన్‌గా మొదటిసారి ట్రోఫీని అందుకోవడానికి ఫైనల్ పోరుకు సై అంటున్నారు.
 

IPL 2024 : చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడేందుకు సిద్ధంగా ఉండ‌టంతో ఐపీఎల్ 2024  క్లైమాక్స్‌కు చేరుకుంది. ఇరు జ‌ట్లు గెలుపుపై ధీమాతో ఉన్నాయి. ఇద్దరు కెప్టెన్లు, శ్రేయాస్ అయ్యర్, పాట్ కమిన్స్ లు తమ జట్టును ఫైనల్‌కి నడిపించడంలో గొప్ప వ్యూహాల‌తో ముందుకు న‌డించారు. ఇప్పుడు ఇద్దరూ కెప్టెన్‌గా మొదటిసారి ట్రోఫీని అందుకోవడానికి ఫైన‌ల్ పోరుకు సై అంటున్నారు. అయితే, ఐపీఎల్ 17 ఏళ్ల చరిత్రలో కొంతమంది ఆటగాళ్ళు, జ‌ట్లు లేకుండా ఫైనల్ జ‌ర‌గ‌నుంది.

ఐపీఎల్ చరిత్రలో కేవలం మూడోసారి చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో ఒకటి జ‌ట్టు లేకుండా ఐపీఎల్ ఫైన‌ల్ జ‌రుగుతోంది. ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటాన్స్‌తో ఆడినప్పుడు చివరిసారి ఇలాంటి సంఘటన జరిగింది. మొదటిసారి 2014లో కింగ్స్ XI పంజాబ్ కేకేఆర్ తో త‌ల‌ప‌డిన‌ప్పుడు, రెండో ట్రోఫీని గెలుచుకున్నప్పుడు ఇది మొదటిసారి జరిగింది.

IPL 2024 PRIZE MONEY: ఐపీఎల్ 2024 విజేత‌కు ప్రైజ్ మ‌నీ ఎంత‌? ర‌న్న‌ర‌ప్ ఎంత అందుకుంటారు?

ఇక చెన్నై సూపర్ కింగ్స్ 10 సార్లు ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకున్న జట్టు. ఇది ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక సార్లు ఫైన‌ల్ కు చేరిన జ‌ట్టుగా రికార్డును న‌మోదుచేసింది. సీఎస్కే 2008, 2010, 2011, 2012, 2013, 2015, 2018, 2021, 2023 ల‌లో ఐపీఎల్ ఫైన‌ల్ చేరుకుంద‌తి. ఈ టైమ్ లో ఎంఎస్ ధోని సీఎస్కేను ముందుకు న‌డిపించాడు. అలాగే, త‌న కెప్టెన్సీ ధోని ఐదు సార్లు చెన్నైకి ఐపీఎల్ టైటిళ్లను (2010, 2018, 20211, 2011, 2011) అందించాడు. చెన్నై త‌ర్వాత ముంబై ఇండియన్స్ 6 సార్లు (2010, 2013, 2015, 2017, 2019, 2020) ఫైనల్‌కు చేరుకోగలిగింది. అలాగే, రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఐదుసార్లు  (2013, 2015, 2017, 2019, 2020) ఐపీఎల్ ఛాంపియ‌న్ గా నిలిచింది. ఐపీఎల్ లో అత్య‌ధిక సార్లు టైటిల్ గెలిచిన జ‌ట్లుగా చెన్నై, ముంబై టీమ్స్ స‌మంగా ఉన్నాయి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడు సార్లు (2009, 2011, 2016) మూడు వేర్వేరు కెప్టెన్ల (అనిల్ కుంబ్లే, డేనియల్ వెట్టోరీ, విరాట్ కోహ్లీ) ఆధ్వర్యంలో ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే గత 17 ఏళ్లలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేక‌పోయింది.

భార్య న‌టాషాతో హార్దిక్ పాండ్యా విడాకులు... ​ భరణం కింద తన ఆస్తుల్లో 70 శాతం వాటా.. !

click me!