IPL 2024 Prize Money: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఐపీఎల్ 2024 ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. అయితే, ఐపీఎల్ 2024 విజేతకు ఎంత ప్రైజ్ మనీ లభిస్తుంది? రన్నరప్ ఎంత అందుకుంటారు?
IPL 2024 Prize Money: ఐపీఎల్ 2024 తుది సమరానికి సమయం ఆసన్నమైంది. మే 26న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఐపీఎల్ 2024 ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ - సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. కేకేఆర్, ఎస్ఆర్హెచ్ లు లీగ్ దశ తర్వాత మొదటి రెండు జట్లుగా నిలిచాయి. క్వాలిఫయర్ 1 లో కేకేఆర్ విజయం సాధించి ఫైనల్‌కు అర్హత సాధించింది. హైదరాబాద్ క్వాలిఫయర్ 2 లో గెలిచి కేకేఆర్ తో ఫైనల్ పోరుకు సిద్ధమైంది.
ఐపీఎల్ విజేత ప్రైజ్ మనీ ఎంత?
undefined
2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు ఐపీఎల్ విజేత రాజస్థాన్ రాయల్స్‌కు 4.8 కోట్లు, రన్నరప్‌కు రూ. 2.4 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. టోర్నమెంట్ ఒక ప్రయోగాత్మక లీగ్‌గా ప్రారంభమైంది.. ఆ తర్వాత ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన లీగ్‌లలో ఒకటిగా మారింది. కొన్నేళ్లుగా ప్రైజ్ మనీ కూడా చాలా రెట్లు పెరిగింది. ప్రస్తుత సీజన్ విషయానికొస్తే, బీసీసీఐ జట్లకు కేటాయించిన మొత్తం పర్స్ 46.5 కోట్లు. దీనిని ఐపీఎల్ విజేతలు, రన్నరప్‌లు, ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ విజేతలు మొదలైన వారికి పంపిణీ చేయనుంది. ఐపీఎల్ 2024 విజేత రూ.20 కోట్ల ప్రైజ్ మనీ అందుకుంటుంది.
ఐపీఎల్ రన్నరప్‌లు ఎంత ప్రైజ్ మనీ అందుకుంటారు?
ప్రస్తుత సీజన్ లో ఐపీఎల్ రన్నరప్ రూ.13 కోట్ల మొత్తాన్ని అందుకోనుంది. మూడు, నాల్గవ స్థానాల్లో నిలిచిన జట్లకు వరుసగా రూ. 7 కోట్లు, రూ. 6.5 కోట్లు లభిస్తాయి.
ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ విజేతకు ఎంత మొత్తం అందుకుంటారు?
ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లి 741 పరుగులతో టాప్ లో ఉన్నారు. ఈ ఏడాది ఆరెంజ్ క్యాప్ గెలుచుకోవడం దాదాపు ఖాయమైనట్టే. అలాగే, 24 వికెట్లు పడగొట్టిన హర్షల్ పటేల్ పర్పుల్ క్యాప్‌ను కైవసం చేసుకునే అవకాశం ఉంది. తద్వారా ఆటగాళ్లు ఒక్కొక్కరికి 15 లక్షల చొప్పున ప్రైజ్ మనీ అందుకుంటారు. 'ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్' రూ. 20 లక్షలు అందుకోగా, సీజన్‌లోని 'మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్' రూ.12 లక్షలు అందుకుంటారు.
భార్య నటాషాతో విడాకుల వార్తల మధ్య హార్దిక్ పాండ్యా వీడియో వైరల్.. మస్తు ఖతర్నాక్..