IPL 2024 Final : ఐపీఎల్ 2024 ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. హైదరాబాద్ బ్యాటింగ్, కోల్‌కతా బౌలింగ్ బిగ్ ఫైట్ కోసం క్రికెట్ ప్రపంచంలో ఉత్కంఠ నెలకొంది. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్.. కేకేఆర్ బౌలింగ్.. బిగ్ ఫైట్ లో ఎవరిది పైచేయి అవుతుంది? ఎవరి బలాలు ఎలా ఉన్నాయి?
IPL 2024 Final : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (ఐపీఎల్ 2024) ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ - సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే ఫైనల్ పోరులో హైదరాబాద్ బ్యాటింగ్, కోల్ కతా బౌలింగ్ బిగ్ ఫైట్ కోసం క్రికెట్ ప్రపంచంలో ఉత్కంఠ నెలకొంది. ఇరు జట్లలో బలమైన బ్యాటర్లు, బౌలర్లు ఉన్నారు. అయితే, సన్ రైజర్స్ ఓపెనింగ్ బ్యాటింగ్ ను అడ్డుకోకపోతే చెన్నై గ్రౌండ్ లో పరుగుల వరద పారడం ఖాయం. కానీ, కోల్ కతా బౌలింగ్ చాలా బలంగా కనిపిస్తోంది. హైదరాబాద్ బ్యాటింగ్, కోల్ కతా బౌలింగ్ బలాలు గమనిస్తే..
హైదరాబాద్ లో పరుగుల సునామీ సృష్టించే బ్యాటర్లు
undefined
ఐపీఎల్ 2024 లో హైదరాబాద్ ఓపెనింగ్ బ్యాటర్లు దుమ్మురేపే ప్రదర్శనతో ఎక్కడలేని క్రేజ్ ను సంపాదించారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్-అభిషేక్ శర్మలతో పాటు మిడిలార్డర్ లో కూడా హెన్రిజ్ క్లాసెన్, రాహుల్ త్రిపాఠిలతో హైదరాబాద్ బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది.
హైదరాబాద్ తరఫున ఐపీఎల్ 2024లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు
1. ట్రావిస్ హెడ్ - 567 పరుగులు (192 కు పైగా స్ట్రైక్ రేటు)
2. అభిషేక్ శర్మ - 482 పరుగులు ( 200 కు పైగా స్ట్రైక్ రేటు)
3. హెన్రిచ్ క్లాసెన్ - 463 పరుగులు ( 172 కు పైగా స్ట్రైక్ రేటు)
కోల్ కతా సూపర్ బౌలింగ్.. వీరికి ఎదురు నిలబడితేనే..
కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ విభాగంలో కూడా చాలా బలంగా కనిపిస్తోంది. కోత్ కతా బౌలింగ్ ను ఎదురు నిలబడితేనే హైదరాబాద్ ఛాంపియన్ గా నిలవగలదు. లేకుంటే రన్నరప్ గానే ఐపీఎల్ 2024 ను ముగించాల్సి ఉంటుంది. కోల్ కతా జట్టులో ఈ సీజన్ లో టాప్ వికెట్ టేకర్స్ ను గమనిస్తే సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణాలు ముందున్నారు. అయితే, ఐపీఎల్ లోనే ఖరీదైన ఆటగాడిగా ఉన్న మిచెల్ స్టార్క్ మరోసారి విజృంభిస్తే మ్యాచ్ వన్ సైడ్ చేయగలడు.
కోల్ కతా తరఫున ఐపీఎల్ 2024లో అత్యధిక వికెట్లు తీసుకున్న ఆటగాళ్లు
1. వరుణ్ చక్రవర్తి - 20 వికెట్లు (8.18 ఎకానమీ)
2. హర్షిత్ రాణా - 17 వికెట్లు (9.40 ఎకానమీ)
3. సునీల్ నరైన్ - 16 వికెట్లు (6.90 ఎకానమీ)
IPL 2024: 17 ఏళ్లలో మూడోసారి ఇలా ఐపీఎల్ ఫైనల్...
IPL 2024 Prize Money: ఐపీఎల్ 2024 విజేతకు ప్రైజ్ మనీ ఎంత? రన్నరప్ ఎంత అందుకుంటారు?