IPL 2024 Auction: మిచెల్ స్టార్క్ దెబ్బ‌.. ఐపీఎల్ అబ్బ.. అత్యంత ఖరీదైన ప్లేయర్ ఇతనే..

By Mahesh Rajamoni  |  First Published Dec 19, 2023, 4:05 PM IST

IPL 2024 Auction LIVE: దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో ఆస్ట్రేలియ‌న్ ప్లేయ‌ర్ల కోసం టీంలు తెగ‌పోటీ ప‌డ్డాయి. ఈ క్ర‌మంలోనే మిచెల్ స్టార్క్ ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్యంత ఖ‌రీదైన ప్లేయ‌ర్ గా నిలిచాడు. అత‌న్ని కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ ద‌క్కించుకుంది. 
 


IPL 2024 Auction LIVE updates: దుబాయ్‌లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మినీ వేలంలో కొత్త రికార్డులు న‌మోద‌వుతున్నాయి. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్యంత ఖ‌రీదైన ప్లేయ‌ర్ గా కొత్త రికార్డు సృష్టించాడు. అత‌న్ని కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ ఏకంగా రూ.24.75 కోట్లకు దక్కించుకుంది. దీంతో ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఆస్ట్రేలియ‌న్ పేస‌ర్ మిచెల్ స్టార్క్ నిలిచాడు. అత‌ని క‌నీస ధ‌ర రూ.2 కోట్లు కాగా, 25.75 కోట్ల‌తో కోల్ క‌తా టీం అత‌న్ని ద‌క్కించుకుంది.

మిచెట్ స్టార్క్ టీ20 కెరీర్ గ‌మ‌నిస్తే.. 58 మ్యాచ్ ల‌లో 73 వికెట్లు తీశాడు. ఎకాన‌మీ 7.6 ఉంది. బెస్ట్ బౌలింగ్ గ‌ణాంకాలు 4-20 గా ఉన్నాయి. ఐపీఎల్ కెరీర్ గ‌మ‌నిస్తే..మొత్తం 27 మ్యాచ్ ల‌లో 34 వికెట్లు తీశాడు. ఎకాన‌మీ 7.2గా ఉంది.  బౌలింగ్ బెస్ట్ 4-15. మొత్తంగా 121 టీ20ల్లో 7.5 ఎకాన‌మీతో 170 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 

Latest Videos

IPL 2024 Auction: ఆల్‌రౌండర్ హర్షల్ పటేల్ కోసం ఫైట్.. పంజాబ్ ఎంత‌కు ద‌క్కించుకుందంటే..?

మిచెల్ స్టార్క్ కోసం ముంబ‌యి ఇండియ‌న్స్, ఢిల్లీ క్యాపిట‌ల్స్, కోల్ క‌తా, గుజ‌రాత్, ల‌క్నో టీంలు పోటీప‌డ్డాయి. బేస్ ధర రెండు కోట్ల నుంచి మొద‌లైన వేలం కొత్త రికార్డులు సృష్టించింది. 2 కోట్లతో ఢిల్లీ బిడ్డింగ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ముంబ‌యి ఎంట‌ర్ అయింది. ఇద్ద‌రి మ‌ధ్య బిడ్ వ‌రుస పెట్టి ముందుకు సాగింది. మ‌రింత ఆస‌క్తిక‌రంగా కేకేఆర్ ఎంట్రీ బిడ్ ను ప్రారంభించింది. అలాగే, గుజ‌రాత్ కూడా 10 కోట్ల‌తో ఎంట్రీ బిడ్ షురూ చేసింది. ఫ్రాంచైజీలలో హాట్ ఫేవరెట్‌గా ఉండ‌టంతో రికార్డు బిడ్ సాగింది. ఇక గుజ‌రాత్, కేకేఆర్ మ‌ధ్య గ‌ట్టి పోటీ కొన‌సాగింది. నరైన్, వరుణ్, సుయాష్‌లను బ్యాకప్ చేయడానికి అనుభవజ్ఞుడైన విదేశీ ఫాస్ట్ బౌలర్ కోసం కేకేఆర్ వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఒకానొక సమ‌యంలో 25 కోట్ల‌కు చేరు గుజ‌రాత్ వెన‌క్కి త‌గ్గ‌డంతో కేకేఆర్ రూ. 24.75 కోట్లకు ద‌క్కించుకుంది. 
 

IPL 2024 Auction: చెన్నై టీంలోకి డారిల్ మిచెల్.. కీవీస్ ప్లేయ‌ర్ కు భారీ ధ‌ర‌..

IPL 2024 Auction: ఐపీఎల్ రికార్డు బ్రేక్.. ప్యాట్ క‌మ్మిన్స్ కు దిమ్మ‌దిరిగే ధ‌ర‌.. !

click me!