IND vs AFG: విరాట్ కోహ్లీ డ‌కౌట్.. 4 ఓవర్లకు 4 వికెట్లు డౌన్.. క‌ష్టాల్లో టీమిండియా

By Mahesh Rajamoni  |  First Published Jan 17, 2024, 7:47 PM IST

India vs Afghanistan: తొలి రెండు మ్యాచుల్లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడో టీ20 మ్యాచ్ లోనూ ఆఫ్ఘ‌నిస్తాన్ ను చిత్తు చేయాల‌ని చూస్తున్న టీమిండియాకు మ్యాచ్ ప్రారంభంలోనే షాక్ తగిలింది. 4 ఓవ‌ర్ల‌ల‌కే కీల‌క‌మైన 4 వికెట్లు కోల్పోయింది. 
 


India vs Afghanistan T20 Match: భార‌త్-ఆఫ్ఘ‌నిస్తాన్ టీ20 సిరీస్ ను విజ‌యవంతంగా ముంగించాల‌ని భార‌త్ టార్గెట్ చేసుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన రెండు మ్యాచ్ ల‌లో తిరుగులేని అధిప‌త్యం ప్ర‌ద‌ర్శించిన భార‌త్ మూడో టీ20 మ్యాచ్ లోనూ ఆఫ్ఘ‌నిస్తాన్ ను చిత్తుచేయాల‌ని చూసింది కానీ, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జ‌రుగుతున్న భార‌త్-అఫ్గానిస్థాన్ టీ20 మూడో మ్యాచ్ లో భార‌త్ క‌ష్టాల్లో ప‌డింది. నాలుగు ఓవ‌ర్ల‌లోనే 4 వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్ లో అద‌ర‌గొడుతాడ‌నున్న విరాట్ కోహ్లీ డ‌కౌట్ గా వెనుదిరిగాడు.

ఈ సిరీస్ రెండో మ్యాచ్ లో ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో అద‌ర‌గొట్టిన శ‌య‌స్వి జైస్వాల్ 4 ప‌రుగులు చేసి ఔట్ అయ్యాడు. తొలి, రెండో మ్యాచ్ లో అద్భుత‌మైన ఆట‌తో రాణించిన శివ‌మ్ దుబే కూడా ఈ మ్యాచ్ లో నిరాశ‌ప‌రిచాడు. 6 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేసి అజ్మతుల్లా బౌలింగ్ లో గుర్బాజ్ కు క్యాచ్ గా దొరికిపోయాడు. జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. నబీ బౌలింగ్ షాట్ ఆడి ఫరీద్ అహ్మద్ కు క్యాచ్ గా దొరికిపోయాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ, రింకూ సింగ్ లు క్రీజులో ఉన్నారు. అఫ్ఘనిస్తాన్ బౌలర్లలో మూడు ఓవర్లు వేసిన ఫరీద్ అహ్మద్ మాలిక్ మూడు వికెట్లు తీసుకున్నాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ ఒక వికెట్ తీసుకున్నాడు.

Latest Videos

భారత్ వికెట్ల పతనం : 18-1 ( యశస్వి జైస్వాల్ , 2.3), 18-2 ( విరాట్ కోహ్లీ , 2.4), 21-3 ( శివమ్ దూబే , 3.6), 22-4 ( సంజు శాంసన్ , 4.3)

మూడో టీ20లో ఆఫ్ఘ‌నిస్తాన్ కు మూడిన‌ట్టేనా.. భార‌త్ చేతిలో వైట్ వాష్ త‌ప్ప‌దా.. !

భార‌త్-అఫ్గానిస్థాన్ 3వ టీ20 కోసం జట్లు:

ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI):

రహ్మానుల్లా గుర్బాజ్(w), ఇబ్రహీం జద్రాన్(c), గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, షరాఫుద్దీన్ అష్రఫ్, కైస్ అహ్మద్, మహ్మద్ సలీమ్ ఎ సఫీ, మలీద్

భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(సి), విరాట్ కోహ్లి, శివమ్ దూబే, సంజు శాంసన్(w), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్

అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠకు విరాట్ కోహ్లీ-అనుష్క శర్మలు..

click me!