IND vs AFG: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్-అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ లో భాగంగా మూడో మ్యాచ్ బుధవారం జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లలో మార్పులు జరిగాయి.
India vs Afghanistan: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్-అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ లో భాగంగా మూడో మ్యాచ్ బుధవారం జరుగుతోంది. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు టీమ్స్ లో మార్పులు చేర్పులు చేశాయి.
టాస్ తర్వాత అఫ్ఘానిస్థాన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ మాట్లాడుతూ.. 'మేము ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాము. మేము సిరీస్ నుండి కొన్ని సానుకూలాంశాలను తీసుకున్నాము, మేము ఈ రోజు మరికొన్నింటి కోసం ప్రయత్నిస్తాము. జట్టులో మేము మూడు మార్పులు కూడా చేసాము' అని తెలిపాడు.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. 'మేము మొదట బ్యాటింగ్ చేస్తాము. మేము మొదటి రెండు గేమ్‌లలో బౌలింగ్ చేసాము. కాబట్టి మేము ఈ రోజు బ్యాటింగ్ చేస్తాము. వికెట్‌తో సంబంధం లేదు, కొన్ని కాంబినేషన్‌లను ప్రయత్నించి కొన్ని అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నాను. కొత్త ముఖాలను ప్రయత్నించడానికి ఇది మరొక అవకాశం. మేము మూడు మార్పులు చేసాము. సంజు, అవేష్, కుల్దీప్ లను జట్టులో ఉన్నారు. అక్షర్, జితేష్, అర్ష్ దీప్ లకు విశ్రాంతి ఇచ్చామని' తెలిపాడు.
మూడో టీ20లో ఆఫ్ఘనిస్తాన్ కు మూడినట్టేనా.. భారత్ చేతిలో వైట్ వాష్ తప్పదా.. !
భారత్-అఫ్గానిస్థాన్ 3వ టీ20 కోసం జట్లు:
ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI):
రహ్మానుల్లా గుర్బాజ్(w), ఇబ్రహీం జద్రాన్(c), గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, షరాఫుద్దీన్ అష్రఫ్, కైస్ అహ్మద్, మహ్మద్ సలీమ్ ఎ సఫీ, మలీద్
భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(సి), విరాట్ కోహ్లి, శివమ్ దూబే, సంజు శాంసన్(w), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్
అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠకు విరాట్ కోహ్లీ-అనుష్క శర్మలు..