టెన్ష‌న్ పెంచుతున్న భార‌త్-పాకిస్తాన్ మ్యాచ్.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024కు ఉగ్రముప్పు

By Mahesh Rajamoni  |  First Published May 30, 2024, 11:04 PM IST

T20 World Cup 2024 - IND vs PAK : టీ20 వరల్డ్ కప్ 2024 ప్రారంభం కానున్న మరికొన్ని గంటల్లో మరోసారి  భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు ఉగ్రదాడి బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఐసీసీ అన్ని చర్యలు తీసుకుంటున్నామనీ, భద్రత తొలి ప్రాధాన్యతగా ఉంటుందని పేర్కొంది. 
 


T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ 2024 కు సర్వం సిద్దంచేసింది ఐసీసీ. అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా జరిగే ఈ ప్ర‌పంచ క‌ప్ లో మొత్తం 20 జ‌ట్లు పాల్గొంటున్నాయి. అయితే, ఈ మెగా టోర్న‌మెంట్ కు ఉగ్ర‌దాడి బెదిరింపులు రావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. న్యూయార్క్ లోని ఐసెన్ హోవర్ పార్క్ స్టేడియంలో జూన్ 9న జరగనున్న భారత్-పాక్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ కు ముప్పు పొంచి ఉందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో నివేదిక ప్రకారం మ్యాచ్ కు ముప్పు పొంచి ఉందన్న వార్తల నేపథ్యంలో భద్రతా చర్యలు ముమ్మరం చేశారు.

ఇదివ‌ర‌కే భార‌త్-పాక్ మ్యాచ్ కు బెదిరింపులు పంపిన ఉగ్ర‌వాదులు మ‌రోసారి దాడులు చేస్తామంటూ వీడియోలు పంపించ‌డం క‌ల‌వ‌రం రేపుతోంది. ఈ క్ర‌మంలోనే తాము పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామనీ, ప్రస్తుత ఇంటెలిజెన్స్ రిపోర్టుల‌ ఆధారంగా ఈ సమయంలో విశ్వసనీయమైన ప్రజా భద్రతా ముప్పు లేదని న్యూయార్క్ గవర్నర్ కార్యాలయం పేర్కొంది. మాన్హాటన్కు తూర్పున 25 మైళ్ల దూరంలో ఉన్న ఐసెన్ హోవర్ పార్క్ స్టేడియం జూన్ 3 నుండి 12 వరకు ఎనిమిది ఐసీసీ టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ ల‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.

Latest Videos

'నేను నా గర్ల్‌ఫ్రెండ్ ను తీసుకురావచ్చా?'.. సునీల్ నరైన్‌-గౌతమ్ గంభీర్ మొద‌టి చాట్‌లో ఇలా..

ఈ క్రీడలు సజావుగా జరిగేలా చూడటానికి ప్ర‌భుత్వ స‌హ‌కారంతో ప‌న‌చేస్తున్న‌ట్టు గవర్నర్ కాథీ హోచుల్ నొక్కి చెప్పారు. "పెరిగిన చట్ట అమలు ఉనికి, అధునాతన నిఘా, సమగ్ర స్క్రీనింగ్ ప్రక్రియలతో సహా అధిక భద్రతా చర్యలలో పాల్గొనాలని నేను న్యూయార్క్ స్టేట్ పోలీసులను ఆదేశించాను" అని పేర్కొన్నారు. ప్రజల భద్రతే తమ‌ ప్రథమ ప్రాధాన్యమనీ, ప్రపంచ కప్ సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావ‌ర‌ణంలో జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. 

ఇదే క్ర‌మంలో టోర్నీ అంతటా అన్ని వేదికల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తామని ఐసీసీ హామీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఐసీసీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ఈ ఈవెంట్ లో పాల్గొనే ప్రతి ఒక్కరి భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యమని, సమగ్రమైన, పటిష్టమైన భద్రతా ప్రణాళిక తమ వద్ద ఉందన్నారు. "మేము మా ఆతిథ్య దేశాలలోని అధికారులతో కలిసి పనిచేస్తున్నాము. మా ఈవెంట్ కు గుర్తించబడిన ఏవైనా ప్రమాదాలను తగ్గించడానికి తగిన ప్రణాళికలు ఉన్నాయని నిర్ధారించడానికి అన్ని చ‌ర్య‌ల‌ను తీసుకుంటూనే ఉన్నాము" అని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు, అధికారులు, ప్రేక్షకులకు రక్షణ కల్పించే లక్ష్యంతో భారత్-పాక్ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ కట్టుదిట్టమైన భద్రతా ప్రోటోకాల్స్ లో సాగాలని భావిస్తున్నారు. పోలీసు బందోబ‌స్తున్న పెంచ‌డంతో పాటు అధునాతన నిఘాను ఉంచ‌నున్నారు.

'నేను నా గర్ల్‌ఫ్రెండ్ ను తీసుకురావచ్చా?'.. సునీల్ నరైన్‌-గౌతమ్ గంభీర్ మొద‌టి చాట్‌లో ఇలా..

click me!