Ind Vs NZ: కంటి చూపుతో చంపేస్తా..! న్యూజిలాండ్ ఓపెనర్ కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన దీపక్ చాహర్

Published : Nov 18, 2021, 12:46 PM ISTUpdated : Nov 18, 2021, 12:47 PM IST
Ind Vs NZ: కంటి చూపుతో చంపేస్తా..! న్యూజిలాండ్ ఓపెనర్ కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన దీపక్ చాహర్

సారాంశం

Deepak chahar: ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ భారీ స్కోరు చేసేలా కనిపించింది.  మార్టిన్ గప్తిల్, మార్క్ చాప్మన్ విజృంభించినా చివర్లో భారత బౌలర్లు వారిని కట్టడి చేశారు.

టీమిండియా పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ (New Zealand) బుధవారం జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన తొలి టీ20 లో పోరాడి ఓడింది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు.. ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (Martin Guptill), మార్క్ చాప్మన్ (mark chapman) ల వీరవిహారంతో భారీ స్కోరు చేసేలా కనిపించింది. కానీ అశ్విన్ (Ashwin) స్పిన్ మాయాజాలానికి తోడు.. ఆఖర్లో భారత (India) బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో కివీస్ ను కట్టడి చేశారు. అయితే అంతకుముందు న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సిక్సర్లతో జోరు మీదున్న మార్టిన్ గప్తిల్.. భారత యువ బౌలర్ దీపక్ చాహర్ (Deepak chahar) ల మధ్య ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. 

ఇన్నింగ్స్ 18వ ఓవర్  వేసిన చాహర్ బౌలింగ్ లో గప్తిల్.. తొలి బంతిని సిక్సర్ గా మలిచాడు. సిక్సర్ కొట్టిన వెంటనే గప్తిల్.. చాహర్ కు సీరియస్ లుక్ ఇచ్చాడు. అయితే గప్తిల్ ఆనందం ఎక్కువసేపు నిలువలేదు.  తర్వాత బంతికే అతడు ఔట్ అయ్యాడు.  చాహర్ వేసిన  తర్వాత బంతిని కూడా గాల్లోకి లేపాలని ప్రయత్నించిన గప్తిల్.. శ్రేయస్ అయ్యర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇప్పుడు చాహర్ వంతు.. ఔటై పెవిలియన్ వైపునకు వెళ్తున్న గప్తిల్ వంక సీరియస్  లుక్ ఇచ్చాడు చాహర్. ఈరెండు లుక్స్ కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

 

ఇద్దరి మధ్య  వాగ్వాదం ఏమీ జరుగకున్నా.. కనీసం పల్లెత్తు మాట అనుకోకపోయినా కళ్లతోనే కావాల్సినంత గొడవ పెట్టుకున్నారు ఈ ఇద్దరు. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్  వెల్లువెత్తుతున్నాయి. పలువురు చాహర్ లుక్ ను బాహుబలి సినిమాలో ప్రభాస్ లుక్స్ తో పోలుస్తున్నారు. అనుష్క సైనికాధికారి చేతి వేళ్లను నరికినప్పుడు అప్పుడు అతడు రాజ మందిరంలో దాని గురించి వివరిస్తుండగా అక్కడకు వచ్చిన ప్రభాస్.. ఏమీ మాట్లాడకున్నా నేరగాడి  చుట్టూ తిరిగే సీన్ ను గుర్తుకు  తెస్తూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.

 

ఆమె ఎక్కడ..? 

 

ఇదిలాఉండగా.. న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తుండగా దీపక్ చాహర్  మ్యాచ్ చూడటానికి వచ్చిన తన సోదరితో మాట్లాడిన సంభాషణ కూడా వైరల్ గా మారుతున్నది. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో ఫీల్డింగ్ చేస్తుండగా.. చాహర్  సోదరి వీడియో తీస్తూ అతడిని పిలిచింది. అప్పుడతడు.. ‘ఆమె ఎక్కడ..?’ అంటూ తనకు కాబోయే భార్య (Deepak chahar Lover) గురించి ఆరా తీశాడు. ఇటీవలే ఐపీఎల్ లో చాహర్.. జయా భరద్వాజ్ కు లవ్ ప్రపోజ్ చేసిన విషయం తెలిసిందే. నిన్న జరిగిన మ్యాచ్ చూడటానికి భరద్వాజ్ కూడా వచ్చింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA: ధర్మశాలలో అదరగొట్టిన భారత బౌలర్లు.. అభిషేక్ శర్మ ఊచకోత
టీమిండియాలో నయా సంజూ శాంసన్.. పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న ఆరోన్ జార్జ్ ఎవరు?