Ind Vs NZ: సూర్యకుమార్ యాదవ్ భార్యకు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన న్యూజిలాండ్ బౌలర్.. అతడి రియాక్షన్ ఇదే..

By team teluguFirst Published Nov 18, 2021, 11:56 AM IST
Highlights

Surya kumar Yadav: నిన్న న్యూజిలాండ్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్సే హైలైట్. న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ తన భార్యకు పుట్టినరోజు  కానుక ఇచ్చాడంటూ సూర్య షాకింగ్ కామెంట్స్ చేశాడు.

టీ20 ప్రపంచకప్ (T20 World Cup) ముగిసిన తర్వాత భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ (New Zealand).. టీమిండియా (Team India)తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో పరాజయం పాలైన విషయం తెలిసిందే. చివరివరకు ఉత్కంఠగా సాగిన నిన్నటి పోరులో భారత బ్యాటర్లు దంచికొట్టారు. కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తో కలిసి యువ  ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ (Surya Kumar Yadav) .. మ్యాచ్ గమనాన్ని మార్చేశారు. కివీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని టీమిండియా.. మరో రెండు బంతులు మిగిలుండగానే సాధించింది.  అయితే మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్సే హైలైట్. ఇదిలాఉండగా.. కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ (Trent Boult) తన భార్యకు పుట్టినరోజు కానుక ఇచ్చాడంటూ సూర్య యాదవ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. 

అసలేం జరిగిందంటే.. రోహిత్ తో కలిసి  బ్యాటింగ్ చేసిన సూర్య కుమార్ మ్యాచ్ ను భారత్ వైపునకు తిప్పాడు. కివీస్ బౌలింగ్ ను చీల్చి చెండాడాడు. అయితే హాఫ్ సెంచరీ చేసిన సూర్య.. భారత విజయాన్ని మరింత త్వరగా  కానిచ్చేయాలని సౌథీ (Tim Southee) వేసిన 17వ ఓవర్లో ఓ భారీ షాట్ ఆడాడు. అది నేరుగా  ట్రెంట్  బౌల్ట్ చేతుల్లోకి వెళ్లినా అతడు దానిని జారవిడిచాడు. దీంతో సూర్య బతికిపోయినా.. మళ్లీ తర్వాత ఓవర్లో  బౌల్ట్ బౌలింగ్ లోనే ఔటవడం గమనార్హం. 

అయితే మ్యాచ్ అనంతరం సూర్య మాట్లాడుతూ.. బౌల్ట్ తన క్యాచ్ జారవిడిచి తన (సూర్యకుమార్) భార్యకు పుట్టినరోజు కానుక ఇచ్చాడని ఫన్నీగా వ్యాఖ్యానించాడు. సూర్య మాట్లాడుతూ.. ‘బౌల్ట్ నా క్యాచ్ వదిలేసి నా భార్యకు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చాడు. ఇవాళ ఆమె పుట్టినరోజు. ఆమెకు అతడిచ్చిన సరైన బహుమానం అదే (క్యాచ్ జారవిడవడం..)’ అని అన్నాడు. ఇంకా సూర్య మాట్లాడుతూ.. ‘ఈ మ్యాచ్ లో నేను కొత్తగా ఏమీ చేయలేదు. గత మూడు, నాలుగేళ్లలో ఎలా ఆడుతున్నానో ఈరోజూ అలాగే ఆడాను. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నదానినే మైదానంలోనూ ఆడాను. నా ఆటతీరును నిత్యం సమీక్షించుకుంటాను.  పరిస్థితులకు తగ్గట్టు ఎలా ఆడితే మంచిదో ముందే నిర్ణయించుకుంటాను..’ అని అన్నాడు.

 

SKY isn't the limit 👌
Battle with Boult 😀
Birthday gift for wife 😊 talks about it all in this interview with after 's win in Jaipur. 👍 👍 - By

Full interview 🎥 🔽 https://t.co/pPp17Ef51Q pic.twitter.com/hNQyLzfDTP

— BCCI (@BCCI)

కెఎల్ రాహుల్ నిష్క్రమించిన తర్వాత వన్ డౌన్ గా దిగిన సూర్య.. క్రీజులో కుదురుకునేదాకా ఆచితూచి ఆడినా  ఆపై చెలరేగాడు.  దొరికిన బంతిని దొరికినట్టు  బౌండరీ లైన్ దాటించాడు. మంచు ప్రభావంతో బంతి తేలిగ్యానే బ్యాట్ పైకి వచ్చిందన్న సూర్య.. మ్యాచ్ చివర్లో కాస్త ఉత్కంఠ నెలకొన్నా.. గెలిచినందుకు సంతోషంగా ఉందని చెప్పాడు. అయితే తానే మ్యాచ్ గెలిపించి ఉంటే మరింత సంతోషించేవాడినని సూర్య చెప్పుకొచ్చాడు.

click me!