బుమ్రాను విమర్శిస్తున్నవారికి అదిరిపోయే పంచ్ ఇచ్చిన ఇషాంత్!

By telugu teamFirst Published Feb 23, 2020, 1:09 PM IST
Highlights

ఆటతీరుతో పస తగ్గిందని, బుమ్రాను డీకోడ్ చేశారని అంటూ సోషల్ మీడియాలో చర్చలు కూడా పెట్టేస్తున్నారు. పత్రికల్లో కూడా వార్తలు తెగ ప్రచురితమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఎందరో క్రికెటర్లు బుమ్రాకు అండగా నిలుస్తున్నారు. 

భారత జట్టులో ప్రస్తుతానికి పంత్ కన్నా కూడా ఎవరన్నా విమర్శలను ఎదుర్కుంటున్నారంటే అది ఖచ్చితంగా జస్ప్రీత్ బుమ్రా నే. గాయం నుంచి కోలుకున్న తరువాత అతడు నేరుగా జట్టులోకి వచ్చాడు. అప్పడి నుండి అతడు తన పూర్వపు లయను దొరకబుచ్చుకోవడానికి విశ్వా ప్రయత్నం చేస్తున్నాడు. 

తాజాగా అతడు మ్యాచుల్లో వికెట్లను కూల్చడంలో ఇబ్బంది పడుతున్నాడు. వికెట్ల మాట అటుంచితే.... అతడి బౌలింగ్లో ప్రత్యర్థులు పరుగులు రాబట్టుకోవడమే కాదు... చీల్చి చెండాడుతున్నారు కూడా. న్యూజిలాండ్ సిరీస్ లో పేలవమైన ప్రదర్శన చేస్తున్న బుమ్రా పై విమర్శకులు విరుచుకుపడుతున్నారు. 

అతడి ఆటతీరుతో పస తగ్గిందని, బుమ్రాను డీకోడ్ చేశారని అంటూ సోషల్ మీడియాలో చర్చలు కూడా పెట్టేస్తున్నారు. పత్రికల్లో కూడా వార్తలు తెగ ప్రచురితమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఎందరో క్రికెటర్లు బుమ్రాకు అండగా నిలుస్తున్నారు. 

తాజాగా టీం ఇండియా బౌలర్ ఇషాంత్ శర్మ బుమ్రాపై విమర్శలు గుప్పిస్తున్నవారిపై మండిపడ్డాడు.రెండేళ్లుగా టెస్టుల్లో తాను, బుమ్రా, షమీ, అశ్విన్‌, జడేజా కలిసి 20 వికెట్లు పడగొడుతున్నామని, కేవలం ఒక మ్యాచ్‌ లేక ఒక ఇన్నింగ్స్‌తో ఓ ఆటగాడి సాఘార్థ్యాన్నిఎలా ప్రశ్నిస్తారని మంది పడ్డాడు ఇషాంత్. 

బుమ్రా ప్రతిభ గురించి ఎవరూ ప్రశ్నించరని అనుకుంటున్నానని, అరంగేట్ర మ్యాచ్‌ నుంచి అతడు సాధించిన రికార్డులు, ఘనతలు మనందరికీ తెలుసునని, కష్టకాలంలో అండగా నిలవాలని హితవు పలికాడు.

ఇలా ఒక ఇన్నింగ్స్‌కే గత అభిప్రాయాలను మార్చుకొని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందిని ఇషాంత్‌ అభిప్రాయపడ్డాడు. గతంలో నెహ్రా కూడా బుమ్రా కు ఇలానే మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. 

ప్రతి సిరీస్ లోనూ బుమ్రా రాణించాలని అనుకోవడం సరి కాదని ఆయన అన్నాడు. అతను ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకుంటున్నాడని నెహ్రా అన్నాడు. 

ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని, ఆడిన ప్రతీసారి అత్యుత్తమ ప్రదర్శన ఎవరికీ సాధ్యం కాదని అన్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం ఈ సిరీస్ లో విఫలమయ్యాడని ఆయన వ్యాఖ్యానించాడు. తుది జట్టును ప్రకటించే ముందు జట్టు యాజమాన్యం సరైన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డాడు.

Also Read: కివీస్ పై చెత్త ప్రదర్శన: అగ్రస్థానాన్ని కోల్పోయిన బుమ్రా

బుమ్రా, మొహమ్మద్ షమీలు కాకుండా మిగతా పేస్ బౌలర్లు కూడా వారి బాధ్యతలను గుర్తించాలని నెహ్రా అన్నాడు. ప్రధాన బౌలర్లపై ఆధారపడకుండా తమ వంతు కృషి చేయాలని ఆయన సూచించాడు. బుమ్రాపై ఒత్తిడి తీవ్రమవుతోందని ఆయన అన్నాడు. టీ20ల్లో మంచి ప్రదర్శన చేసిన నవదీప్ సైనీని కివీస్ తో జరిగే టెస్టు సిరీస్ కు తీసుకోవాలని ఆయన సూచించాడు. 

ఉమేష్ యాదవ్ కన్నా సైనీనే మంచి ప్రదర్శన చేస్తాడని ఆయన అభిప్రాయపడ్డాడు. నవదీప్ సైనీకి అవకాశాలు ఇ్తే సరైన లైన్ అండ్ లెంగ్త్ లో బంతులు వేసి భవిష్యత్తులో వికెట్లు తీస్తాడని నెహ్రా అన్నాడు.

Also Read: కేఎల్ రాహుల్ 12వ స్థానంలో వచ్చినా....: శిఖర్ ధావన్ కామెంట్

గత రెండేళ్లుగా బుమ్రా, షమీ టీమిండియాకు కీలకమైన పేసర్లుగా మారారు. డెత్ ఓవర్లలో కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్ లో బౌలింగ్ చేస్తూ టీమిండియా విజయంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుమ్రాపై వస్తున్న విమర్శలపై నెహ్రూ స్పందించాడు. న్యూజిలాండ్ పై జరిగిన మూడు వన్డేల సిరీస్ ను ఇండియా కోల్పోయిన విషయం తెలిసిందే. సిరీస్ ను న్యూజిలాండ్ క్లీన్ స్వీప్ చేసింది.

click me!