న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా: ఇషాంత్ శర్మ అరుదైన ఘనత

By telugu teamFirst Published Feb 23, 2020, 10:27 AM IST
Highlights

న్యూజిలాండ్ పై జరుగుుతన్న తొలి టెస్టు మ్యాచులో ఐదు వికెట్లు తీయడం ద్వారా ఇషాంత్ శర్మ జహీర్ ఖాన్ రికార్డును సమం చేశాడు. తద్వారా ఎక్కువసార్లు ఓ మ్యాచులో ఐదు వికెట్లు తీసిన ఘనతలో రెండో స్థానంలో ఉన్నాడు.

వెల్లింగ్టన్: భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచులో టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. మ్యాచులో ఐదు వికెట్లు తీయడం ద్వారా మాజీ పేసర్ జహీర్ ఖాన్ సరసన నిలిచాడు. న్యూజిలాండ్ పై జరుగుతున్న టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్సులో ఇషాంత్ శర్మ ఐదు వికెట్లు తీయడం ద్వారా ఆ ఘనత సాధించాడు. 

న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ టామ్ లూథమ్ (11), టామ్ బ్లండెల్ (30), రాస్ టేలర్ (44), టిమ్ సౌథీ (6), ట్రెంట్ బౌల్ట్ (38)లను ఇషాంత్ శర్మ ఔట్ చేశాడు. దీంతో అతను టెస్టు మ్యాచుల్లో ఇప్పటి వరకు 297 వికెట్లు తీశాడు. మరో మూడు వికెట్లు తీస్తే భారత్ తరఫున టెస్టుల్లో 300 వికెట్ల క్లబ్ లో చేరుతాడు.  

ఈ ఘనత సాధించిన భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ జహీర్ ఖాన్ తో రెండో స్థానాన్ని పంచుకున్నాడు. ఈ ఘనత సాధించడానికి జహీర్ ఖాన్ 92 టెస్టు మ్యాచులు తీసుకోగా, ఇషాంత్ శర్మ 97 మ్యాచుల్లో ఆ ఘనత సాధించాడు. 23 సార్లు ఐదు వికెట్లు తీసిన కపిల్ దేవ్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. 

విదేశీ గడ్డపై ఎక్కువ సార్లు ఒక్క మ్యాచులో ఐదు వికెట్లు తీసిన భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ మూడో స్థానంలో నిలిచాడు. అతను విదేశీ గడ్డపై 9 సార్లు ఐదు వికెట్లు తీశారు. ఇందులో 12 సార్లు విదేశీ గడ్డపై 12 సార్లు ఐదు వికెట్లు తీసిన కపిల్ దేవ్ అగ్రస్థానంలో నిలువగా పది సార్లు ఐదు వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే రెండో స్థానంలో నిలిచాడు. 

click me!