
Yashasvi Jaiswal Century: రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్టు మ్యాచ్‌లో ఎడమచేతి వాటం ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇంగ్లాండ్ బౌలింగ్ ను ఉతికిపారేశాడు. 'బాజ్ బాల్ కాదు'.. 'జైస్ బాల్' అని నిరూపిస్తూ.. సెంచరీ బాదాడు. హాఫ్ సెంచరీ కి ఒక పరుగు వసరమైన సమయంలో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. ఇక సెంచరీని సైతం బౌండరితో సాధించాడు టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్.
భారత్-ఇంగ్లాండ్ ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇది జైస్వాల్ కు రెండో సెంచరీ. టీమిండియాలో స్టార్ ప్లేయర్లు దూరమైన సమయంలో యశస్వి జైస్వాల్ ఆడిన ఈ ఇన్నింగ్స్ భారత్ కు మరింత బలాన్ని అందించింది. యశస్వి జైస్వాల్ టెస్టు కెరీర్‌లో ఇది మూడో సెంచరీ. వరుసగా రెండో టెస్టు మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. అంతకుముందు, సిరీస్‌లోని రెండవ మ్యాచ్ విశాఖపట్నం టెస్టులో డబుల్ సెంచరీ సాధించాడు. ఇది జైస్వాల్ కెరీర్‌లో మొదటి డబుల్ సెంచరీ. కేవలం 7వ మ్యాచ్‌లోనే యశస్వి మూడో సెంచరీ పూర్తి చేశాడు. తన కెరీర్‌లో తొలి టెస్టు మ్యాచ్‌లో కూడా జైస్వాల్ వెస్టిండీస్‌పై సెంచరీ సాధించాడు. జేమ్స్ అండర్సన్ లాంటి బలమైన బౌలర్‌పై జైస్వాల్ పరుగుల వరద పారించాడు.
ఈ టెస్టు మ్యాచ్‌లో జైస్వాల్ 122 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ 81.97. జైస్వాల్ వన్డే, టీ20ల్లో కూడా ఫాస్ట్ పేస్‌తో బ్యాటింగ్ చేయడం విశేషం. వన్డే, టీ20 క్రికెట్ లాగా టెస్ట్ క్రికెట్‌లో కూడా దూకుడు శైలితో ముందుకుసాగుతున్నాడు.
IPL 2024 - CSK : ధోని తో జోడీ కట్టిన కత్రినా కైఫ్.. !