India vs England: రాజ్ కోట్ టెస్టు.. రెండో ఇన్నింగ్స్ లో రోహిత్ శ‌ర్మను బోల్తా కొట్టించిన జోరూట్.. !

By Mahesh Rajamoni  |  First Published Feb 17, 2024, 3:25 PM IST

India vs England: ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో బెన్ డకెట్ 153 పరుగులు, ఓలీ పోప్ 39 పరుగులు, బెన్ స్టోక్స్ 41 పరుగులతో రాణించ‌డంతో 319 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భార‌త్ కు .126 ప‌రుగుల అధిక్యం ల‌భించింది. 
 


India vs England: రాజ్ కోట్ లో జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్టులో భారత బౌలర్లు రాణించడంతో 319 పరుగులకు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ను ముగించింది. భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ 4 వికెట్లు తీసుకున్నాడు. దీంతో భార‌త్ కు 126 ప‌రుగుల అధిక్యం ల‌భించింది. తొలి ఇన్నింగ్స్ లో భార‌త్ 445 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. రోహిత్ శ‌ర్మ‌, ర‌వీంద్ర జ‌డేజాలు సెంచ‌రీలు సాధించారు. అరంగేట్రం ప్లేయ‌ర్లు స‌ర్ఫ‌రాజ్ ఖాన్ హాఫ్ సెంచ‌రీ కొట్టాడు. ధృవ్ జురెల్ సైతం మంచి నాక్ ఆడాడు. 

అయితే,  తొలి ఇన్నింగ్స్ లో 131 ప‌రుగుల‌తో చెల‌రేగిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ.. రెండో ఇన్నింగ్స్ లో పెద్ద‌గా ప‌రుగులు చేయ‌లేదు. స్వ‌ల్ప స్కోర్ కే ఔట్ అయ్యాడు. జో రూట్ బౌలింగ్ లో ఎల్బీడ‌బ్ల్యూగా ఔట్ అయ్యాడు. 19 ప‌రుగుల‌కే పెవిలియ‌న్ చేరాడు. మ‌రో ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్, శుభ్ మ‌న్ గిల్ లు భార‌త ఇన్నింగ్స్ ను కొన‌సాగిస్తున్నారు. ప్ర‌స్తుతం జైస్వాల్ 61*, గిల్ 22* ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. 

Latest Videos

రోహిత్ కెప్టెన్సీలో భార‌త్ T20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తుంది.. జైషా కామెంట్స్ పై హిట్ మ్యాన్ రియాక్ష‌న్ వైరల్ !

తొలి ఇన్నింగ్స్ లో కీల‌క‌మైన స‌మ‌యంలో మంచి ఇన్నింగ్స్ తో రోహిత్ శ‌ర్మ సెంచ‌రీ కొట్టాడు. 196 బంతుల్లో 131 ప‌రుగులు సాధించాడు. రోహిత్ త‌న సెంచ‌రీ ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు, 3 సిక్స‌ర్లు బాదాడు. ర‌వీంద్ర జ‌డేజా కూడా సెంచ‌రీ కొట్టాడు. 225 బంతులు ఎదుర్కొన్న జ‌డేజా 112 ప‌రుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఇక ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో బెన్ డ‌కెట్ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ లో సెంచ‌రీ కొట్టాడు. 151 బంతులు ఎదుర్కొని 153 ప‌రుగులు చేయ‌గా, ఇందులో 23 ఫోర్లు, 2 సిక్స‌ర్లు ఉన్నాయి. 

IPL 2024 - CSK : ధోని తో జోడీ క‌ట్టిన కత్రినా కైఫ్.. !

click me!