India-England Test: భారత్-ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు రాజ్‌కోట్ వేదికగా జరగనుంది. రాజ్‌కోట్ స్టేడియం బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కు కూడా అనుకూలంగా ఉంటుందని పిచ్ రిపోర్టులు పేర్కొంటున్నాయి.
India-England Rajkot Test : భారత్-ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లలో చెరో ఒకటి గెలిచి సిరీస్ ను 1-1తో సమం చేశాయి. మూడో టెస్టు రాజ్ కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో విజయం భారత్ దే అనుకున్నప్పటికీ అనూహ్యంగా పుంజుకున్న ఇంగ్లాండ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. విశాఖలో జరిగిన రెండో టెస్టులో భారత్ 106 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తుచేసింది. ఇప్పుడు మూడో టెస్టును గెలవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఇరు జట్లలో కూడా మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
రాజ్‌కోట్ గత రికార్డులు ఎలా ఉన్నాయి..?
రాజ్‌కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో విషయానికొస్తే ఇప్పటివరకు ఇక్కడ భారత్ రెండు టెస్టులు ఆడింది. 2016-18 సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరిగిన తొలి మ్యాచ్ డ్రాగా ముగిసింది. బెన్ స్టోక్స్, జో రూట్ సెంచరీలతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 537 పరుగులు చేయగా, మురళీ విజయ్ సెంచరీతో భారత్ 488 పరుగులు చేసింది. ఈ రెండు ఇన్నింగ్స్ లకు గణనీయమైన సమయం పట్టడంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్టు.. రికార్డుల మోతే.. !
2018లో వెస్టిండీస్ తో జరిగిన రెండో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పృథ్వీ షా, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా సెంచరీలతో భారత్ 649/9 భారీ స్కోరు చేసింది. విండీస్ 181, 196 పరుగులకే ఆలౌటవడంతో భారత్ ఘన విజయం సాధించింది.
రాజ్‌కోట్ లో టెస్టు క్రికెట్ రికార్డులు ఇవే..
అత్యధిక టీమ్ స్కోరు: భారత్ - వెస్టిండీస్ పై 649/9 పరుగులు.
అత్యల్ప టీమ్ స్కోరు: వెస్టిండీస్ - భారత్ పై 181 పరుగులు.
అత్యధిక పరుగులు: విరాట్ కోహ్లీ - 228 పరుగులు, ఛతేశ్వర్ పుజారా - 228 పరుగులు.
అత్యధిక వికెట్లు: రవిచంద్రన్ అశ్విన్ - 9 వికెట్లు.
అత్యధిక వ్యక్తిగత స్కోరు: విరాట్ కోహ్లీ - వెస్టిండీస్ పై 139 పరుగులు.
ఉత్తమ బౌలింగ్ గణాంకాలు: కుల్దీప్ యాదవ్ - వెస్టిండీస్ పై 5/57 వికెట్లు.
రాజ్‌కోట్ స్టేడియం, పిచ్ రిపోర్టు ఏం చెబుతోంది..?
గుజరాత్ లోని రాజ్ కోట్ లో సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియం 2008లో ఏర్పాటు చేశాడు. 28,000 మంది ప్రేక్షకుల సీటింగ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం పిచ్ రిపోర్టును గమనిస్తే.. ఇక్కడ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కు అనుకూలంగా అవకాశాలు ఉంటాయి. రాజ్‌కోట్ లోని ఉపరితలం ఒక విలక్షణమైన భారత టెస్ట్ వికెట్ ను అందిస్తుంది. ఇక్కడ తొలి మూడు రోజులు బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటాయి. ఆ తర్వాత బౌలింగ్ కు అనుకూలంగా పిచ్ మారుతుంది. దీంతో చివరిరోజువరకు మ్యాచ్ ఎలా మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా ఉంది.
WRESTLING : భారత్ కు గుడ్ న్యూస్.. నిషేధం ఎత్తివేత.. !