భార‌త్-ఇంగ్లాండ్ మూడో టెస్టు.. రికార్డుల మోతే.. !

By Mahesh Rajamoni  |  First Published Feb 14, 2024, 12:32 PM IST

IND vs ENG Test: టీమిండియా-ఇంగ్లాండ్ లు తొలి రెండు మ్యాచ్ ల‌ తర్వాత సిరీస్ 1-1తో సమమైంది. మూడో మ్యాచ్ లో బెన్ స్టోక్స్, జేమ్స్ అండర్సన్, రవిచంద్రన్ అశ్విన్ లు చారిత్రాత్మక రికార్డు సృష్టించే ఛాన్స్ ఉంది.
 


IND vs ENG Test Records: ఐదు టెస్టు మ్యాచ్ ల‌ సిరిస్ లో భాగంగా ఫిబ్రవరి 15 నుంచి రాజ్ కోట్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, వెటరన్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ల‌కు ఈ మ్యాచ్ చాలా ప్రత్యేకం. అలాగే, భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఈ టెస్టులో మ‌రో రికార్డు సృష్టించే అవకాశముంది. దీంతో పాటు ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా రాజ్ కోట్ మైదానంలో భారత జట్టు విజయయాత్ర‌ను కొనసాగించాల‌నే ప‌ట్టుద‌లో ఉంది. ప్రస్తుతం భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ 1-1తో సమంగా ఉన్నాయి. మూడో మ్యాచ్ ఫిబ్రవరి 15 నుంచి భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 గంటలకు రాజ్ కోట్ లో జరగనుంది.

బెన్ స్టోక్స్ కెరీర్ లో 100వ టెస్టు.. 

Latest Videos

undefined

ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కెరీర్ లో ఇది 100వ టెస్టు మ్యాచ్ కావడం విశేషం. ఈ మ్యాచ్ లో అడుగుపెట్టిన వెంటనే భారీ రికార్డును న‌మోదుచేస్తాడు. ఈ మ్యాచ్ లో ల్యాండ్ కాగానే 100 టెస్టులు ఆడిన 16వ ఇంగ్లాండ్ ప్లేయ‌ర్ గా బెన్ స్టోక్స్ నిలుస్తాడు. ఇప్పటివరకు ఇంగ్లాండ్ తరఫున అత్యధికంగా 184 టెస్టులు ఆడిన ఆటగాడిగా జేమ్స్ అండర్సన్ రికార్డు సృష్టించాడు. అంత‌ర్జాతీయ క్రికెట్ లో మొత్తంగా అత్యధిక 200 టెస్టులు ఆడిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ రికార్డు సృష్టించాడు.

బెన్ స్టోక్స్ 200 వికెట్ల  క్ల‌బ్ లో చేర‌నున్నాడు.. ! 

ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తన కెరీర్ లో ఇప్పటివరకు 99 టెస్టు మ్యాచ్ ల్లో 146 ఇన్నింగ్స్ ల్లో 197 వికెట్లు పడగొట్టాడు. తర్వాతి టెస్టులో బౌలింగ్ చేసి 3 వికెట్లు తీస్తే మరో రికార్డు సృష్టిస్తాడు. టెస్టుల్లో 200 వికెట్లు తీసిన 17వ ఇంగ్లాండ్ ఆటగాడిగా నిలుస్తాడు. ఇప్పటివరకు ఇంగ్లాండ్ తరఫున అత్యధికంగా 695 టెస్టు వికెట్లు తీసిన రికార్డు జేమ్స్ అండర్సన్ పేరిట ఉంది.

జేమ్స్ అండర్సన్ 700 వికెట్లకు 5 వికెట్ల దూరంలో..

ఇంగ్లాండ్ తరుపున 184 మ్యాచ్ ల‌లో 695 టెస్టు వికెట్లు తీసిన బౌలర్ గా 41 ఏళ్ల వెటరన్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ నిలిచాడు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్ గా కూడా రికార్డు సృష్ట‌లించాడు. రాజ్ కోట్ టెస్టులో మరో 5 వికెట్లు తీస్తే త‌న‌ టెస్టు కెరీర్ లో 700 వికెట్లు కూడా పూర్తి చేసుకుంటాడు. దీంతో ప్రపంచ క్రికెట్ లో 700 వికెట్లు తీసిన మూడో బౌలర్ గా అండర్సన్ నిలుస్తాడు. ఇప్పటివరకు టెస్టు క్రికెట్లో అత్యధిక 800 వికెట్లు తీసిన రికార్డు శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ పేరిట ఉంది.

500 వికెట్ల రికార్డుకు మరో అడుగు దూరంలో అశ్విన్

37 ఏళ్ల స్టార్ స్పిన్నర్ అశ్విన్ కూడా ఈ టెస్టు మ్యాచ్ లో మ‌రో గొప్ప రికార్డును నమోదు చేసే అవకాశం ఉంది. అశ్విన్ ఇప్పటివరకు 97 టెస్టుల్లో 183 ఇన్నింగ్స్ ల‌లో 499 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ లో మ‌రో ఒక్క వికెట్ తీసుకుంటే 500 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్ గా చ‌రిత్ర సృష్టిస్తాడు. గతంలో టెస్టుల్లో 500 వికెట్లు తీసిన రికార్డు మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పేరిట ఉంది. కుంబ్లే త‌న కెరీర్ లో 619 వికెట్లు పడగొట్టాడు.

AUS VS WI: ఆండ్రీ రస్సెల్ విధ్వంసం.. డేవిడ్ వార్న‌ర్ ఊచ‌కోత‌.. !

click me!