AUS vs WI: ఆండ్రీ రస్సెల్ విధ్వంసం.. డేవిడ్ వార్న‌ర్ ఊచ‌కోత‌.. !

By Mahesh Rajamoni  |  First Published Feb 14, 2024, 9:19 AM IST

Australia vs West Indies: ఆస్ట్రేలియా-వెస్టిండీస్ జట్ల మధ్య పెర్త్ వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో కరీబియన్ జట్టు 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆండ్రీ రస్సెల్, షెర్ఫేన్ రూథర్ ఫ‌ర్డ్ 67 బంతుల్లో 139 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు విజయాన్ని అందించారు.
 


David Warner - Andre Russell: ఆండ్రీ రస్సెల్ విధ్వంసంతో వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనను చాలా అద్భుతంగా ముగించింది. మూడు టీ20ల సిరీస్ లో భాగంగా ఇరు జట్ల మధ్య చివరి మ్యాచ్ పెర్త్ లో జరిగింది. ఈ మ్యాచ్ లో కరీబియన్ జట్టు 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆండ్రీ రస్సెల్ మ‌రోసారి అద్భుత‌మైన ఆట‌తో ఆస్ట్రేలియా బౌలింగ్ ను ఊచకోత కోశాడు. అలాగే, సూప‌ర్ బౌలింగ్ తో ఆక‌ట్టుకున్నాడు. ఆండ్రీ రస్సెల్, షెర్ఫేన్ రూథర్ ఫ‌ర్డ్ 67 బంతుల్లో 139 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు విజయాన్ని అందించారు. కరీబియన్ జట్టు 79 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సమయంలో ఈ భాగస్వామ్యంతో జ‌ట్టుకు విజ‌యం అందించ‌డంలో కీల‌క పాత్ర పోషించారు.

రసెల్, రూథర్ ఫ‌ర్డ్ ల‌రికార్డు భాగస్వామ్యం

Latest Videos

undefined

వాస్తవానికి ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన విండీస్ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది.  ఆరంభంలో మొద‌ట బ్యాటింగ్ చేయ‌డం త‌ప్ప‌ని తెలుసుకుంది. ఆ జట్టు 79 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే, ఆ త‌ర్వాత త‌మ‌దైన ఆట‌తో రాణించి జ‌ట్టు స్కోరును డ‌బుల్ సెంచ‌రీ దాటించారు.  ఆండ్రీ రస్సెల్, రూథర్ ఫ‌ర్డ్ కలిసి 139 పరుగుల చరిత్రాత్మక భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును 6 వికెట్ల నష్టానికి 220 పరుగులకు చేర్చారు.

ఆండ్రీ రస్సెల్ ఊచ‌కోత‌.. 

మ‌రోసారి ఆండ్రీ రస్సెల్ త‌న బ్యాట్ ప‌వ‌ర్ చూపించాడు. ఈ మ్యాచ్ లో ఆండ్రీ రస్సెల్ 29 బంతుల్లో 71 పరుగులు చేశాడు. అత‌ని ఇన్నింగ్స్ లో 7 సిక్సర్లు, 4 ఫోర్లు బాదాడు. అలాగే రూథర్ ఫ‌ర్డ్ సైతం 40 బంతుల్లో 67 పరుగులు చేశాడు. త‌న ఇన్నింగ్స్ లో 5 సిక్సర్లు, 5 ఫోర్లు బాదాడు. దీంతో విండీస్ జట్టు కంగారూల ముందు 221 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

డేవిడ్ వార్నర్ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్.. 

222 ప‌రుగుల భారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఆస్ట్రేలియాకు డేవిడ్ వార్న‌ర్ మంచి శుభారంభం అందించారు. త‌న బ్యాట్ తో మెరుపులు మెరిపించాడు. కానీ ఇత‌ర ఆట‌గాళ్లు స‌హ‌కారం అందించ‌లేక‌పోయారు. ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు మాత్రమే చేసి 37 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా తరఫున ఓపెనర్ డేవిడ్ వార్నర్ 49 బంతుల్లో 81 పరుగులు చేసినా జట్టును గెలిపించలేకపోయాడు.  వార్న‌ర్ త‌న ఇన్నింగ్స్ లో 3 సిక్సర్లు, 9 ఫోర్లు బాదాడు. 

ఆస్ట్రేలియాదే సిరీస్.. 

ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మ‌ధ్య మూడు మ్యాచ్ సిరీస్ జ‌రిగింది. ఇందులో ఇప్ప‌టికే ఆస్ట్రేలియా తొలి రెండు మ్యాచ్ ల‌లో విజ‌యం సాధించింది. ఈ మూడో మ్యాచ్ లో విండీస్ విజయం సాధించినప్పటికీ సిరీస్ ను ఆస్ట్రేలియా 2-1తో కైవసం చేసుకుంది. సిరీస్ తొలి మ్యాచ్ లో కంగారూ జట్టు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. అలాగే, రెండో టీ20లో 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. కానీ మూడో మ్యాచ్ లో ఆస్ట్రేలియా 37 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఇషాన్‌ కిషన్ ను బీసీసీఐ టార్గెట్ చేసిందా? అతని కెరీర్ ముందుకు సాగ‌డం క‌ష్ట‌మేనా.. !

click me!