IND vs ENG : బ్యాటింగ్ or బౌలింగ్.. రాంచీ టెస్టులో ఎవ‌రిది పై చేయి.. ? పిచ్ రిపోర్టు ఏం చెబుతోంది?

By Mahesh Rajamoni  |  First Published Feb 23, 2024, 9:02 AM IST

India vs England: భార‌త్-ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో మూడు మ్యాచ్ లు జ‌ర‌గ్గా శుక్ర‌వారం నుంచి రాంచీలో 4 టెస్టు జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే రోహిత్ శ‌ర్మ నాయ‌క‌త్వంలోని టీమిండియా 2-1 అధిక్యంలో ఉంది. 
 


IND vs ENG 4th Test: ఇంగ్లాండ్ తో జరుగుతున్న 5 మ్యాచ్ ల‌ టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు ఇప్పుడు 2-1 ఆధిక్యంలో ఉంది. శుక్ర‌వారం నుంచి రాంచీ వేదిక‌గా 4 టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్ లో గెలిచి సీర‌స్ ను కైవ‌సం చేసుకోవాల‌ని భార‌త్ భావిస్తోంది. ఇదే స‌మ‌యంలో ఇంగ్లాండ్ కూడా త‌ప్ప‌కుండా గెల‌వాల‌ని వ్యూహాలు ర‌చిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు సాగిన మ్యాచ్ ల‌లో బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ ఇరు జ‌ట్ల ప్లేయ‌ర్లు అద‌ర‌గొట్టాడు. దీంతో రాంచీ టెస్టుపై ఆస‌క్తి పెరిగింది. 

బౌలింగ్.. బ్యాటింగ్.. పిచ్ దేనికి అనుకూలం ? 

Latest Videos

నాలుగో టెస్టు కోసం భారత్-ఇంగ్లాండ్ జట్లు ముందుగానే రాంచీకి చేరుకుని ప్రాక్టిస్ చేశాయి. ప్రస్తుతం ఐదు టెస్టుల సిరీస్లో టీమిండియా 2-1 ఆధిక్యంతో ఉండ‌గా, రాంచీలో ఇంగ్లాండ్ జట్టు బలమైన పునరాగమనం చేయడానికి ప్రయత్నిస్తుంది. రెండు విజ‌యాల‌తో భార‌త్ ఉత్సాహంగా ఉంది. రాంచీ పిచ్ విషయానికొస్తే ఇక్కడ స్పిన్ బౌలర్లకు ఎంతో సహకారం లభిస్తుందని భావిస్తున్నారు. పిచ్ తేలికపాటి గడ్డిని కలిగి ఉంటుంది. దీనికితోడు పగుళ్లు కూడా కనిపించాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ కోసం భారత్, ఇంగ్లాండ్ జట్లు తమ ప్లేయింగ్ ఎలెవన్లో స్పిన్ ఆప్షన్ ను ఎక్కువగా చేర్చకునే అవ‌కాశ‌ముంది. కొంత స‌మ‌యం బ్యాటింగ్ కు కూడా అనుకూలంగా ఉంటుంద‌ని క్రికెట్ విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు.

IPL 2024 Schedule : ఐపీఎల్ 2024 షెడ్యూల్ విడుదల.. తొలిమ్యాచ్ ధోని vs విరాట్ కోహ్లీ

 

Say hello to newest Test debutant - Akash Deep 👋

A moment to cherish for him as he receives his Test cap from Head Coach Rahul Dravid 👏 👏

Follow the match ▶️ https://t.co/FUbQ3Mhpq9 | pic.twitter.com/P8A0L5RpPM

— BCCI (@BCCI)

IPL 2024: మహ్మద్ షమీకి ఏమైంది?

click me!