India vs England: భారత్-ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో తొలి మ్యాచ్ ఓటమి తర్వాత రోహిత్ శర్మ సేన వరుసగా రెండు టెస్టుల్లో విజయం సాధించింది. అయితే, స్టార్ ప్లేయర్ల గాయాల కారణంగా కెప్టెన్‌కి జట్టు ఎంపిక సవాల్ గా మారింది.
IND vs ENG 4th Test: ఇంగ్లాండ్ తో జరుగుతున్న 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు ఇప్పుడు 2-1 ఆధిక్యంలో ఉంది. రాంచీలో జరిగే నాలుగో మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఇదే సమయంలో ఇంగ్లాండ్ నాల్గో టెస్టు మ్యాచ్ లో గెలవాలని భావిస్తోంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి నాలుగో మ్యాచ్ జరగనుంది. రాంచీ మ్యాచ్‌లో భారత స్టార్ క్రికెటర్లలో ఒకరు తిరిగి జట్టులోకి వచ్చే అవకాశముండగా, మరో కొత్త ప్లేయర్ అరంగేట్రం చేసే అవకాశం కూడా ఉందని బీసీసీఐ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో స్టార్ ప్లేయర్లు గాయాలతో దూరం కావడంతో జట్టు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.. !
టాప్-5లో కొత్త ప్లేయర్ ఎంట్రీ.. ?
ప్రస్తుతం భారత జట్టు టాప్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సూపర్ ఫామ్ లో ఉన్న యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్.. టాప్ ఆర్డర్‌లో ఈ ఇద్దరితో కలిసి శుభ్‌మన్ గిల్ కూడా టచ్ లోకి వచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో టాప్ ఆర్డర్‌లో ఆటగాళ్లను మార్చాల్సిన అవసరం అంతగా కనిపించడం లేదు. మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే, దేవదత్ పడిక్కల్ 4వ ప్లేస్ అవకాశం పొందవచ్చు. రజత్ పాటిదార్‌కు రెండు టెస్టు మ్యాచ్‌ల్లో అవకాశం లభించినా పెద్దగా రాణించలేదు. కాబట్టి అతని స్థానంలో పడిక్కల్‌కు ఛాన్స్ ఇచ్చే అవకాశముంది. ఆ తర్వాత ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్ ఐదో నంబర్‌లో కొనసాగుతాడు.
IPL 2024 SCHEDULE : ఐపీఎల్ 2024 షెడ్యూల్ విడుదల.. తొలిమ్యాచ్ ధోని VS విరాట్ కోహ్లీ
స్టార్ ప్లేయర్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశముంది..
రాంచీలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను ఆరో స్థానంలో తీసుకోవచ్చు. రవీంద్ర జడేజా బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణిస్తున్నాడు. అలాగే, ధృవ్ జురెల్‌ను వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ప్లేయింగ్ ఎలెవన్‌లో కొనసాగించడం దాదాపు ఖాయం. ఒక స్టార్ ప్లేయర్ ఈ రెండింటితో పునరాగమనం చేయవచ్చు. రాంచీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. దీంతో అక్షర్ పటేల్ మళ్లీ జట్టులో చోటు దక్కించుకోవచ్చు. అతని చేరికతో బ్యాటింగ్‌లోనూ భారత్‌కు కొంత బలం చేకూరుతుంది.
బౌలింగ్ లో మార్పులు చేస్తారా?
భారత జట్టు మేనేజ్‌మెంట్ జడేజా, అక్షర్‌లతో పాటు రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ వంటి నలుగురు స్పిన్నర్లను రంగంలోకి దించే అవకాశముంది. జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి లభించింది. కాబట్టి అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్‌కే అవకాశం ఎక్కువ. అలాంటి సమయంలో జట్టులో ముఖేష్ కుమార్ లేదా ఆకాష్ దీప్ కంటే మహ్మద్ సిరాజ్ స్థానం ఉమ్మడిగా కనిపిస్తోంది.
4వ టెస్టుకు భారత జట్టు అంచనా:
హిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్,అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
కాశ్మీర్ వీధుల్లో బ్యాట్ తో అదరగొట్టిన సచిన్ టెండూల్కర్.. ! వీడియో