IPL 2024 Schedule : ఐపీఎల్ 2024 షెడ్యూల్ విడుదల.. తొలిమ్యాచ్ ధోని vs విరాట్ కోహ్లీ

By Mahesh Rajamoni  |  First Published Feb 22, 2024, 6:51 PM IST

IPL 2024 Schedule : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024 షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది. తొలి మ్యాచ్ మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ‌ధ్య జ‌ర‌గ‌నుంది.
 


IPL 2024 Schedule : క్రికెట్ ల‌వ‌ర్స్ ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 షెడ్యూల్ విడుదలైంది. ఐపీఎల్లో తొలి మ్యాచ్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, డుప్లెసిస్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ చెన్నై వేదిక‌గా జరగనుంది. రాత్రి 8 గంట‌ల‌కు తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. 

సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా తొలి 21 మ్యాచ్ ల‌ (మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు) షెడ్యూల్ విడుదలైంది. 10 నగరాల్లో రెండు వారాల పాటు 21 మ్యాచ్ లు జరగనున్నాయి. ప్రత్యేకత ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి హోమ్ మ్యాచ్ ను వైజాగ్ లో ఆడనుంది. ఐపీఎల్ 2024లో మిగిలిన మ్యాచ్ ల‌ షెడ్యూల్ ను తర్వాత విడుదల చేయనున్నారు. రాత్రి 8 గంటలకు తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. మిగిలిన మ్యాచ్ ల‌ను మధ్యాహ్నం 3.30 లేదా 7.30 గంటలకు ప్రారంభమవుతాయి.

Latest Videos

undefined

ఐపీఎల్ 2024 షెడ్యూల్ ఇదే.. 

1. చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మార్చి 22, చెన్నై, రాత్రి 8.00 PM
2. పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, మార్చి 23, మొహాలీ, మధ్యాహ్నం 3.30 PM
3. కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, మార్చి 23, కోల్‌కతా, సాయంత్రం 7.30 PM
రాజస్థాన్ రాయల్స్ vs లక్నో సూపర్ జెయింట్స్, మార్చి 24, జైపూర్, 3.30 PM
5. గుజరాత్ టైటాన్స్ vs ముంబై ఇండియన్స్, మార్చి 24, అహ్మదాబాద్, 7.30 PM
6. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs పంజాబ్ కింగ్స్, మార్చి 25, బెంగళూరు, 7.30 PM
చెన్నై సూపర్ కింగ్స్ vs గుజరాత్ టైటాన్స్, మార్చి 26, చెన్నై, రాత్రి 7.30 PM
8. సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్, మార్చి 27, హైదరాబాద్, 7.30 PM
9. రాజస్థాన్ రాయల్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, మార్చి 28, జైపూర్, 7.30 PM
10. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs కోల్‌కతా నైట్ రైడర్స్ , మార్చి 29, బెంగళూరు, 7.30 PM
11. లక్నో సూపర్ జెయింట్స్ vs పంజాబ్ కింగ్స్, మార్చి 30, లక్నో, 7.30 PM
12. గుజరాత్ టైటాన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, మార్చి 31, అహ్మదాబాద్, మధ్యాహ్నం 3.30 PM 
13. ఢిల్లీ క్యాపిటల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, మార్చి 31 , వైజాగ్, 7.30 PM
14. ముంబై ఇండియన్స్ vs రాజస్థాన్ రాయల్స్, ఏప్రిల్ 1, ముంబై, 7.30 PM
15. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs లక్నో సూపర్ జెయింట్స్, ఏప్రిల్ 2, బెంగళూరు, 7.30 PM
16. ఢిల్లీ క్యాపిటల్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్, ఏప్రిల్ 3, వైజాగ్,  7.30 PM
17. గుజరాత్ టైటాన్స్ vs పంజాబ్ కింగ్స్, ఏప్రిల్ 4, అహ్మదాబాద్, 7.30 PM
18. సన్‌రైజర్స్ హైదరాబాద్ vs చెన్నై సూపర్ కింగ్స్, ఏప్రిల్ 5, హైదరాబాద్, 7.30 PM 
19. రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఏప్రిల్ 6, జైపూర్, 7.30 PM
20. ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, ఏప్రిల్ 7, ముంబై, 3.30 PM
21. లక్నో సూపర్ జెయింట్స్ vs గుజరాత్ టైటాన్స్, ఏప్రిల్ 7, లక్నో, 7.30 PM

ఐపీఎల్ 2024 కూడా ఐపీఎల్ 2023 సీజన్ మాదిరిగానే ఉంటుంది. మొత్తం 74 మ్యాచ్లు జరుగుతాయి, అయితే గత సంవత్సరం 60 రోజులకు బదులుగా, ఈసారి మ్యాచ్ ల‌ను 67 రోజులు నిర్వ‌హించ‌నున్నారు. సార్వత్రిక ఎన్నికల కారణంగా ఐపీఎల్ షెడ్యూల్ ను వారం రోజుల పాటు పొడిగించారు. 2019లో దేశంలో లోక్ స‌భ‌ ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇదే విధానాన్ని అవలంబించగా, అప్పుడు కూడా ఐపీఎల్ షెడ్యూల్ రెండు భాగాలుగా వచ్చింది. మే 26న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది.

 

The wait is over 🥳

𝙎𝘾𝙃𝙀𝘿𝙐𝙇𝙀 for the first 2⃣1⃣ matches of 2024 is out!

Which fixture are you looking forward to the most 🤔 pic.twitter.com/HFIyVUZFbo

— IndianPremierLeague (@IPL)

WPL 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌కు స‌ర్వం సిద్ధం.. తొలి మ్యాచ్ ఆ రెండు జ‌ట్ల మ‌ధ్య‌నే.. !

click me!