IND vs ENG: కోహ్లీ, ధోని, గంగూలీల రికార్డులను బ్రేక్ చేసిన రోహిత్ శర్మ

By Mahesh Rajamoni  |  First Published Feb 18, 2024, 9:49 PM IST

India vs England : రాజ్‌కోట్ టెస్టులో యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ చేయగా, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు సెంచరీలు కొట్టారు. అలాగే, శుభ్ మన్ గిల్ 9 పరుగుల దూరంలో సెంచరీ కోల్పోగా, సర్ఫరాజ్ ఖాన్ రెండో ఇన్నింగ్స్ లలో అద్భుతమైన ఆటతో అదరగొట్టాడు.
 


India vs England : హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు రాజ్ కోట్ లో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ ను చిత్తుచేసింది. చరిత్ర సృష్టిస్తూ విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శ‌ర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ తో అద‌ర‌గొడుతూ సెంచ‌రీ సాధించాడు. రోహిత్ శ‌ర్మ‌తో పాటు ర‌వీంద్ర జ‌డేజా, య‌శ‌స్వి జైస్వాల్, శుభ్ మ‌న్ గిల్, స‌ర్ఫ‌రాజ్ ఖాన్ లు ప‌రుగుల వ‌ర‌ద పారించారు.

రాజ్ కోట్ టెస్టులో ఇంగ్లాండ్ పై టీమిండియా భారీ ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించ‌డంతో హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ దిగ్గ‌జ క్రికెట‌ర్ల రికార్డును బ్రేక్ చేశాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో భారత జట్టు 400 పరుగులకు పైగా తేడాతో విజయం సాధించడం ఇదే మొద‌టిసారి. ఈ గెలుపుతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మ‌రో రికార్డును న‌మోదుచేశాడు. వన్డేలు , టెస్టుల్లో అత్యధిక పరుగులతో గెలుపులు రోహిత్ కెప్టెన్సీలోనే జరిగాయి. ఈ విజ‌యానికి ముందు న్యూజిలాండ్‌పై భారత్ 372 పరుగుల తేడాతో విజయం సాధించి అత్యధిక ప‌రుగుల‌ విజయాన్ని నమోదు చేసింది.

Latest Videos

INDIA VS ENGLAND : టీమిండియా గెలుపులో ఆరుగురు హీరోలు.. !

అలాగే, గతేడాది వన్డే క్రికెట్‌లో శ్రీలంకపై భారత్ రెండుసార్లు 300 పరుగులకు పైగా తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు రోహిత్ శర్మ నాయ‌క‌త్వంలో భార‌త్ టెస్టుల్లో తొలిసారి 400 పరుగుల తేడాతో విజయం సాధించింది. అత్య‌ధిక ప‌రుగుల తేడాతో భార‌త్ కు విజ‌యాలు అందించిన కెప్టెన్ గా రోహిత్ శ‌ర్మ చ‌రిత్ర సృష్టిస్తూ.. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, సౌర‌వ్ గంగూలీల‌ను అధిగ‌మించారు. అలాగే, టెస్టు క్రికెట్‌లో రోహిత్ శర్మ సెంచరీ చేసిన అన్ని మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయం సాధించడం మరో విశేషం. టెస్టు క్రికెట్‌లో రోహిత్ శర్మ ఇప్పటివరకు 11 సెంచరీలు సాధించగా, భారత్ అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది.

IND vs ENG: మా మాస్ట‌ర్ ప్లాన్ అదే.. మన బౌల‌ర్ల‌ను చూస్తుంటే గ‌ర్వంగా ఉంది : రోహిత్ శ‌ర్మ

click me!