IND vs ENG: ఇంగ్లాండ్ కు దిమ్మ‌దిరిగే షాకిచ్చిన భార‌త్.. జడేజా విశ్వరూపం.. !

By Mahesh Rajamoni  |  First Published Feb 18, 2024, 6:27 PM IST

India vs England : రాజ్ కోట్ టెస్టులో టీమిండియా సూపర్ విక్టరీ సాధించింది. భారత్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లాండ్ కు దిమ్మదిరిగే షాకిచ్చింది. రవీంద్ర జడేజా ఆల్ రౌండ్ షోతో అదరగొట్టాడు.  
 


India vs England : భార‌త్-ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్ లో టీమిండియా స‌రికొత్త రికార్డు సృష్టించింది. ఆల్ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో రాజ్ కోట్ లో జ‌రిగిన మూడో టెస్టులో సూప‌ర్ విక్ట‌రీ సాధించింది. బాజ్ బాల్ తో భ‌య‌పెడుదామ‌నుకున్న ఇంగ్లాండ్ టీమ్ కు ఊహించ‌ని షాకిచ్చింది. బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసి ఇంగ్లాండ్ పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. ఒక రోజు మిగిలి వుండ‌గానే  మూడో టెస్టులో విజ‌యం సాధించి ఐదు మ్యాచ్ ల సిరీస్ లో 2-1తో అధిక్యం సంపాదించింది.

 భారత్ తొలి ఇన్నింగ్స్ లో రోహిత్, జడేజా సెంచరీలు..

Latest Videos

మూడో టెస్టు మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ కు దిగింది. బ్యాటర్స్ రాణించడంతో తొలి ఇన్నింగ్స్ ను 445 పరుగులతో ముగించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (131 పరుగులు), రవీంద్ర జడేజాలు (112 పరుగులు) సెంచరీలు సాధించారు. అలాగే, సర్ఫరాజ్ ఖాన్ 62 పరుగులు, జురెల్ 46 పరుగులు, రవిచంద్రన్ అశ్విన్ 37 పరుగులు సాధించడంతో భాతర్ తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులకు ఆలౌట్ అయింది. మార్క్ వుడ్ 4 వికెట్లు తీసుకున్నాడు.

IPL 2024 - CSK : ధోని తో జోడీ క‌ట్టిన కత్రినా కైఫ్.. !

బెన్ డకెట్ సెంచరీ.. అదరగొట్టిన సిరాజ్ !

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడింది కానీ, భారత్ లాగా 400 మార్క్ ను అందుకోలేకపోయింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో బెన్ డకెట్ సూపర్ ఇన్నింగ్స్ తో  సెంచరీ (153 పరుగులు) కొట్టాడు. ఓలీ పోప్ 39 పరుగులు, బెన్ స్టోక్స్ 41 పరుగులు చేశాడు. మిగతా ప్లేయర్ల పెద్దగా రాణించలేకపోయాడు. భారత బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 319 పరుగులకు ఆలౌట్ అయింది. సిరాజ్ సూపర్ బౌలింగ్ తో ఇంగ్లాండ్ ను దెబ్బతీశాడు. 

యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ.. గిల్ సెంచరీ మిస్..

రెండో ఇన్నింగ్స్ లోనూ భారత బ్యాటర్స్ ధనాధన్ గేమ్ ఆడారు. ముఖ్యంగా టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ దుమ్మురేపాడు. ఇంగ్లాండ్ బౌలింగ్ ను ఉతికిపారేస్తూ డబుల్ సెంచరీ (214 పరుగులు) కొట్టాడు. మరో స్టార్ ప్లేయర్ శుభ్ మన్ గిల్ అడుగు దూరంలో రనౌట్ కారణంగా సెంచరీని కొల్పోయాడు. 91 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. చివరలో సర్ఫరాజ్ ఖాన్ 68 పరుగులు చేశాడు. 4 వికెట్లు కోల్పోయి 430 పరుగుల వద్ద టీమిండియా రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్ ముందు 556 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచింది.

జడేజా విశ్వరూపం.. భారీ తేడాతో భారత్ గెలుపు 

556 పరుగుల భారీ టార్గెట్ తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ను భారత్ బౌలింగ్ తో దెబ్బకొట్టింది. మొదటి నుంచి కోలుకోని విధంగా దెబ్బ మీద దెబ్బ వేసింది. 15  పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్.. 122 పరుగులకే ఆలౌట్ అయింది. రవీంద్ర జడేజా తన అద్భుతమైన బౌలింగ్ తో ఇంగ్లాండ్ ను దెబ్బకొట్టాడు. కీలకమైన ఓలీ పోప్, జోరూట్, బెయిర్ స్టో, బెన్ ఫోక్స్, మార్క్ వుడ్ వికెట్లను తీసుకుని ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. జడేజా 5 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీసుకున్నారు. బుమ్రా, అశ్విన్ లు చెరో వికెట్ సాధించారు. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించిన రవీంద్ర జడేజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్  గా నిలిచాడు. 

IND vs ENG: సెంచ‌రీకి అడుగు దూరంలో శుభ్‌మ‌న్ గిల్ హార్ట్ బ్రేకింగ్ రనౌట్ !

click me!