India vs England, 2nd Test: విశాఖ పిచ్ రిపోర్టు.. రెండో టెస్టు లైవ్ స్ట్రీమింగ్ ఉచితంగా ఎక్కడ చూడవచ్చు..?

Published : Feb 01, 2024, 03:04 PM IST
India vs England, 2nd Test: విశాఖ పిచ్ రిపోర్టు.. రెండో టెస్టు లైవ్ స్ట్రీమింగ్ ఉచితంగా ఎక్కడ చూడవచ్చు..?

సారాంశం

India vs England, 2nd Test: విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా భార‌త్-ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య శుక్ర‌వారం నుంచి జ‌ర‌గబోయే రెండో టెస్టులో ప‌రుగుల వ‌ర‌ద పారే అవ‌కాశ‌ముంది. ఇప్పటివరకు భారత్ ఈ డ్రౌండ్ లో ఆడిన అన్ని టెస్టుల్లో విజయం సాధించింది.  

India vs England: విశాఖపట్నం వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు జరగనుంది. తొలి టెస్టు ఓటమితో ఉన్న భారత్ రెండో టెస్టులో విజయంతో సిరీస్ ను మందుకు కొనసాగించాలని చూస్తోంది. పిచ్ రిపోర్టు, మ్యాచ్ టైమ్, లైవ్ స్ట్రీమ్ వివరాలు గమనిస్తే.. 

వైజాగ్ పిచ్ రిపోర్టు ఎలా ఉంటుంది? 

విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందనీ, భారీ స్కోర్లు నమోదుకావడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే పిచ్ పై స్పిన్నర్లు కూడా ఆధిపత్యం చెలాయించారు. మ్యాచ్ జరుగుతున్న కొద్దీ పిచ్ మరిన్ని మలుపులు తిరుగుతున్నందున స్పిన్నర్ల ప్రదర్శన కీలకంగా ఉంటుంది.

మ్యాచ్ ను ఎప్పుడు ప్రారంభం అవుతుంది? లైవ్ స్ట్రీమ్ ఎక్కడ చూడవచ్చు? 

శుక్రవారం ఉదయం 9.30 గంటలకు భారత్-ఇంగ్లాండ్ రెండో టెస్టు మ్యాచ్ విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం లో ప్రారంభం కానుంది. ప్రత్యక్ష ప్రసారం  జియో సినిమా, స్పోర్ట్స్ 18లలో చూడవచ్చు.

ఈ గ్రౌండ్ లో భాతర గత రికార్డులు ఎలా ఉన్నాయి? 

విశాఖపట్నం స్టేడియంలో భారత్ 2 టెస్టు మ్యాచ్‌లు ఆడగా రెండింటిలోనూ విజయం సాధించింది. 2016లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 246 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఆ తర్వాత 2019లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్ 203 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు ఇంగ్లాండ్ తో జరగబోయే రెండో టెస్టులో విజయం సాధించాలని భారత్ చూస్తోంది.

రెండో టెస్టుకు టీమ్స్ అంచనాలు ఇవే.. 

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రజత్ పాటిదార్/ సర్ఫరాజ్ ఖాన్,కేఎస్ భరత్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్.

ఇంగ్లాండ్:జాక్ క్రాలీ, డకెట్, ఒల్లీ పోప్, రూట్, బెయిర్‌స్టో, స్టోక్స్, బెన్ ఫోక్స్, రిహాన్, హార్ట్లీ, మార్క్ వుడ్, బషీర్.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA : వైజాగ్‌లో దబిడి దిబిడే.. భారత్‌ జట్టులో భారీ మార్పులు.. పిచ్ రిపోర్టు ఇదే
IPL 2026 : దిమ్మతిరిగే ప్లాన్ తో ముంబై ఇండియన్స్.. ముంచెస్తారా !