Mayank Agarwal: ఐసీయూలో క్రికెటర్ మయాంక్ అగర్వాల్.. విమానంలో తాగింది యాసిడా ..! అసలేం జరిగింది?

By Rajesh KarampooriFirst Published Jan 31, 2024, 1:16 AM IST
Highlights

 Mayank Agarwal: టీమిండియా క్రికెటర్‌ మయాంక్‌ అగర్వాల్‌ గురించి కీలక వార్త వెలువడింది. విమానంలో అగర్తల నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న అతని ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. దీంతో అతడ్ని ఆస్పత్రికి తరలించారు. అయితే.. అతని పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చిక్సిత పొందుతున్నట్టు తెలుస్తోంది. అసలేం జరిగింది? 
 

Mayank Agarwal: టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ గురించి కీలక వార్త వెలువడింది. రంజీ ట్రోఫీలో కర్ణాటక క్రికెట్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న మయాంక్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. విమానంలో అగర్తల నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న ఆయన అనారోగ్యం బారిన పడ్డాడు. విమానంలో కూర్చున్న తర్వాత మయాంక్‌ విపరీతమైన గొంతు నొప్పి, మంటతో బాధపడినట్లు తెలుస్తోంది.

అదే సమయంలో తీవ్రంగా వాంతులు కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. విమానం టేకాఫ్ కాకముందే ఈ  ప్రమాదం జరగడంతో అతడ్ని హుటాహూటిన అగర్తలలోని ఐఎల్‌ఎస్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన  ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. కాగా విమానంలో మయాంక్‌కు ఇలా జరగడానికి గల కారణాలు సరిగా తెలియరావడం లేదు.  

Latest Videos

అయితే తాజాగా ఫ్యాన్స్‌ని సంతోషపెట్టే అప్‌డేట్ ఒకటి వచ్చింది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. మయాంక్ అగర్వాల్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. మయాంక్‌కు పెద్దగా ప్రమాదం లేదని, కంగారు పడాల్సిన అవసరం లేదని, అతడు రేపు అంటే బుధవారం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతాడు. ఆ తర్వాత అతను బెంగళూరుకు వెళ్తాడు. దీంతో మయాంక్‌కి ఢిల్లీతో ఆడడం కష్టం.

ఇదే విషయంపై కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ షావీర్ తారాపూర్ మాట్లాడుతూ.. "మయాంక్ అగర్వాల్‌ను అగర్తలలోని ఐఎల్‌ఎస్ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆకస్మిక అస్వస్థతకు గురికావడానికి గల కారణాలు తెలియడం లేదు. ఈ ఘటనపై  ప్రస్తుతం కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు.  

యాసిడ్ తాగారా? 

మరోవైపు.. మయాంక్(Mayank Agarwal) యాసిడ్ తాగడం వల్లే అస్వస్థతకు గురయ్యారనీ, విమాన సిబ్బంది అతడు కూర్చునే సీటు వద్ద వాటర్ బాటిల్‌ కు బదులు యాసిడ్ బాటిల్ పెట్టారని.. ఆ విషయాన్ని గమనించని మయాంక్ ..మంచినీళ్లు అనుకొని మయాంక్ యాసిడ్ తాగడనీ, దీంతో అతడుఅస్వస్థతకు గురై ఉంటారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో నిజమెంత.. అబద్ధమెంత అనేది తెలియాలంటే..  అధికారిక ప్రకటన వెలువడాల్సిందే. ఈ ఘటనపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

ప్రస్తుతం భారత జట్టుకు దూరంగా ఉన్న మయాంక్ రంజీ టోర్నీలో కర్ణాటక జట్టు కెప్టెన్‌గానూ మయాంక్ వ్యవహరిస్తున్నారు. రంజీ ట్రోఫీలో భాగంగా త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక జట్టు సోమవారం గెలిచింది. తదుపరి మ్యాచ్ కోసం కర్ణాటక జట్టు గుజరాత్‌లోని సూరత్‌కు  వెళ్తున్న సమయంలో మయాంక్ అగర్వాల్ అస్వస్థతకు గురయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో మయాంక్ ఈ మ్యాచ్‌లో ఆడగలడా లేదా? అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. 

మయాంక్ రంజీ టీమిండియా తరుపున 5 ఫిబ్రవరి 2020న హామిల్టన్ ODIలో న్యూజిలాండ్‌తో తన చివరి మ్యాచ్ ఆడాడు. ఇప్పటి వరకు భారత జట్టు తరఫున 21 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు. ఈ సమయంలో మయాంక్ 4 సెంచరీల సహాయంతో టెస్టులో 1488 పరుగులు చేశాడు. కాగా వన్డేల్లో 86 పరుగులు చేశారు.

 

click me!