గాల్లో ప‌ల్టీలు కొట్టిన‌ విండీస్ బౌల‌ర్ కెవిన్ సింక్లైర్.. వైర‌ల్ వీడియో !

By Mahesh Rajamoni  |  First Published Jan 26, 2024, 9:27 PM IST

Kevin Sinclair: అరంగేట్రం టెస్టు మ్యాచ్ లో తొలి వికెట్ పడగొట్టిన బౌలర్ మైదానంలో చేసిన‌ విన్యాసాలు వైర‌ల్ గా మారాయి. ఆస్ట్రేలియాతో జరిగిన అరంగేట్ర టెస్టులో వెస్టిండీస్ బౌలర్ కెవిన్ సింక్లైర్ తొలి వికెట్ తీసిన తర్వాత గ్రౌండ్ లో గాల్లో ఎగురుతూ రెండు పల్టీలు కొట్టి సంబ‌రాలు చేసుకున్న విన్యాసాలు వైర‌ల్ గా మారాయి.
 


Kevin Sinclair - cartwheel celebration: అరంగేట్రంలో ఏ క్రికెట‌ర్ కు అయిన అర‌ద‌గొట్టాల‌ని అనుకుంటాడు. బ్యాటింగ్ హాఫ్ సెంచ‌రీ లేదా సెంచ‌రీ కొట్టినా.. బౌల‌ర్ అయితే వికెట్లు తీస్తే వారి చేసుకునే సంబురాలు మాములుగా ఉండ‌వు. ఇదే క్ర‌మంలో త‌న అరంగేట్రం మ్యాచ్ లో తొలి వికెట్ తీసిన అనంత‌రం ఒక బౌల‌ర్ చేసిన విన్యాసాల దృశ్యాలు ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్నాయి. వాటికి లైకులు, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన అరంగేట్ర టెస్టులో వెస్టిండీస్ బౌలర్ కెవిన్ సింక్లైర్ తొలి వికెట్ తీసిన తర్వాత గ్రౌండ్ లో గాల్లో ఎగురుతూ రెండు పల్టీలు కొట్టి సంబ‌రాలు చేసుకున్న విన్యాసాలు వైర‌ల్ గా మారాయి.

వివ‌రాల్లోకెళ్తే.. బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరుగుతోంది. రెండో మ్యాచ్ లో విండీస్ జట్టు పటిష్ట స్థితిలో కనిపించింది. అయితే, ఈ మ్యాచ్ లో మంచి ఇన్నింగ్స్ ఆడిన ఉస్మాన్ ఖవాజాను విండీస్ బౌల‌ర్ కెవిన్ సింక్లైర్ ఔట్ చేశాడు. అత‌నికి ఇది అరంగేట్రం మ్యాచ్. అలాగే, టెస్టు క్రికెట్ లో అత‌నికి ఇదే తొలి వికెట్. దీంతో త‌న తొలి వికెట్ తీసిన ఆనందంలో అత‌ను చేసుకున్న సంబురాలు మాములుగా లేవు. ఉస్మాన్ ఖావాజా వికెట్ తీసిన తర్వాత  కెవిన్ సింక్లైర్ గాల్లో ఎగురుతూ.. రెండు పల్టీలు కొట్టి.. జిమ్నాస్టిక్ విన్యాసాల‌తో సంబురాలు చేసుకున్నాడు. గ్రౌండ్ లో అత‌ను చేసిన ఈ విన్యాసాలు ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్నాయి.

Latest Videos

సౌర‌వ్ గంగూలీని బీట్ చేసిన రోహిత్ శ‌ర్మ.. !

 

THIS CELEBRATION OF KEVIN SINCLAIR IS SPECIAL...!!! 🤯💥pic.twitter.com/jL1nerfuUK

— Mufaddal Vohra (@mufaddal_vohra)

గ్రౌండ్ లో కెవిన్ సింక్లైర్ వికెట్ తీసిన త‌ర్వాత చేసిన విన్యాసాల‌పై కామెట్ల వ‌ర్షం కురుస్తోంది. అత‌నిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ఎందుకంటే ఇలాంటి విన్యాసాలను చేయ‌డం అంత సుల‌భం కాదు. అందుకు చాలా ప్రాక్టీస్ అవసరం. వికెట్ తీసిన తర్వాత బౌలర్లు రకరకాలుగా సెలబ్రేట్ చేసుకోవడం మనం తరచూ చూస్తూనే ఉంటాం కానీ ఇది స్పెషల్ అనే చెప్పాలి.

147 బంతుల్లోనే ట్రిపుల్ సెంచ‌రీ.. త‌న్మ‌య్ అగ‌ర్వాల్ ప్ర‌పంచ రికార్డు..

 

click me!