భారత్ లో 'ఇంగ్లాండ్ బాజ్ బాల్' వ్యూహం ప‌నిచేయ‌దు గురూ.. హర్భజన్ సింగ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

By Mahesh Rajamoni  |  First Published Jan 21, 2024, 2:27 PM IST

India vs England: భారత్-ఇంగ్లాండ్ మ‌ధ్య తొలి టెస్టు మ్యాచ్ జ‌న‌వ‌రి 25న హైద‌రాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలోనే భార‌త స్టార్ బౌల‌ర్ హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. భారత్ లో 'ఇంగ్లాండ్ బాజ్ బాల్' వ్యూహం ఫలించదని కామెంట్ చేశారు. 
 


India vs England-Harbhajan Singh: భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ కు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ జ‌న‌వ‌రి 25న హైద‌రాబాద్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. స్వ‌దేశంలో భార‌త్ ను ఓడించ‌డం అంత తేలిక‌కాదు. అయితే, ప్ర‌స్తుతం క్రికెట్ ప్ర‌పంచంలో భార‌త్-ఇంగ్లాండ్ లు బ‌ల‌మైన జ‌ట్లు. స్వ‌దేశంలో బాజ్ బాల్ తో భార‌త్ ను దెబ్బ‌కొట్టే వ్యూహాల‌ను సిద్ధం చేస్తోంది ఇంగ్లాండ్. అయితే, స్వదేశంలో భారత్‌ను ఓడించేందుకు బాజ్ బాల్ వ్యూహం ఫ‌లితం ఇవ్వ‌ద‌ని టీమిండియా మాజీ స్టార్ బౌల‌ర్ హ‌ర్బ‌జ‌న్ సింగ్ వ్యాఖ్యానించారు.

ఇంగ్లండ్ తన దూకుడు శైలి 'బాజ్ బాల్' వ్యూహంతో టెస్టు క్రికెట్ లో సంచ‌ల‌నానికి తెర‌తీసింది. భారత్ తో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్ లో ఈ గేమ్ ప్లాన్ అమ‌లు చేయాల‌ని చూస్తోంది. అయితే, భారత్ లో 'బాజ్ బాల్ వ్యూహం' పనిచేయదని టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. "బాజ్ బాల్ పని చేయదు. ఇంగ్లాండ్ కు పరిస్థితులు చాలా క్లిష్టంగా మారనున్నాయి. తొలి బంతి నుంచే బాల్ టర్న్ ఉంటుంది. ఇరు జట్ల స్పిన్నర్లు ఈ విష‌యంలో మంచి ఫ‌లితాలు చూడ‌వ‌చ్చని పేర్కొన్నాడు. అయితే, భారత్ విజయావకాశాలు అధికంగా ఉంటాయ‌నీ, టీమిండియా విజ‌యం సాధిస్తుంద‌నే ఆశాభావం వ్యక్తం చేశాడు.

Latest Videos

భార‌త్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో విరాట్ కోహ్లీ బ‌ద్ద‌లు కొట్ట‌బోయే టాప్-5 రికార్డులు ఇవే..

స్పిన్నర్లకు ఏమీ ఇవ్వని పిచ్ దొరికితేనే ఇంగ్లండ్ ఆధిపత్యం చెలాయించగలుగుతుందని హ‌ర్భ‌జ‌న్ సింగ్ అన్నాడు. అలాగే, టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 గురించి కూడా ప్ర‌స్తావించాడు. జూన్ లో కరీబియన్, యూఎస్ఏలో జరగనున్న ప్రపంచకప్ కోసం కనీసం ముగ్గురు స్పిన్నర్లను జట్టులోకి తీసుకోవాలని హర్భజన్ సూచించాడు. తాను చాలా సార్లు కరీబియన్ గడ్డపై ఆడాననీ, స్పిన్నర్లకు అక్క‌డి పిచ్ లు అనుకూలంగా ఉంటాయ‌నీ, ఎప్పుడూ ఏదో ఒకటి ఉంటుందని తెలిపాడు. తన టాప్-3 కంటెస్టెంట్లను వెల్లడించిన హ‌ర్బ‌జ‌న్.. 'యజువేంద్ర చాహల్ ను ఎందుకు విస్మరిస్తున్నారో నాకు తెలియదు. ప్రస్తుతం భారత్ లో చాహల్ కంటే మంచి లెగ్ స్పిన్నర్ లేడని నేను అనుకోవడం లేదు. అతను చాలా ధైర్యవంతుడు, తెలివైన బౌలర్. రవీంద్ర జడేజా కచ్చితంగా ఉంటాడు. భారత్ ఒక ఆఫ్ స్పిన్నర్ ను తీసుకోవాలి, బహుశా వాషింగ్టన్ సుందర్ కావ‌చ్చు. సెలెక్టర్లు, మేనేజ్మెంట్ ఏమనుకుంటారో అది వేరే విషయం, కానీ నేను మేనేజ్మెంట్ లో భాగమై ఉంటే ఈ ముగ్గురిని ఎంచుకునేవాడిన‌ని తెలిపాడు.

టీ20ల్లో స్పిన్నర్లు సత్తా చాటుతార‌ని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. బ్యాట‌ర్స్ ఎప్పుడూ రిస్క్ తీసుకుంటారు కాబట్టి స్పిన్నర్లకు ఈ ఫార్మాట్ బాగా పనిచేస్తుందని తాను అనుకుంటున్నాన‌ని తెలిపాడు. పొట్టి ఫార్మాట్ కు యువ ఆటగాళ్లు బాగా సరిపోతారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. దీనికి భిన్నంగా హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. టీ20 ఫార్మ‌ట్ కు యువ‌కులు అవ‌స‌ర‌మే.. కానీ అనుభ‌వాన్ని విస్మ‌రించ‌లేమ‌ని తెలిపాడు. యంగ్ ప్లేయ‌ర్స్, అనుభ‌వంతో కూడిన ఆట‌గాళ్లు జ‌ట్టులో ఉండాల‌ని పేర్కొన్నాడు.

తగ్గేదేలే.. గ్రౌండ్ లో రెచ్చ‌గొట్టిన బంగ్లాదేశ్.. గెలుపుతో గుణ‌పాఠం చెప్పిన భార‌త్

click me!