IND vs ENG 3rd Test Day 2 highlights: భారత్ vs ఇంగ్లాండ్ మూడో టెస్టు రెండో రోజు రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ తీసుకోవడం ద్వారా టెస్టు క్రికెట్ లో 500 వికెట్లు తీసుకున్న బౌలర్ రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్ ప్లేయర్ బెన్ డకెట్ సెంచరీతో అదరగొట్టాడు.
India vs England, 3rd Test Day 2 highlights: రాజ్‌కోట్‌లో భారత్‌తో జరిగిన 3వ టెస్టులో 2వ రోజు ఇంగ్లాండ్ 'బాజ్‌బాల్' క్రికెట్ తో భారత్ పై పైచేయి సాధించింది. ఇంగ్లాండ్ ప్లేయర్ బెన్ డకెట్ సెంచరీతో అదరగొట్టాడు. కేవలం 35 ఓవర్లలోనే ఇంగ్లాండ్ 207-2 (35 Ov) పరుగులు సాధించింది. రాజ్‌కోట్‌లో టీ విరామం తర్వాత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన 500వ టెస్టు వికెట్‌ని సాధించాడు. మూడో సెషన్ ముగిసేలోపు పేసర్ మహమ్మద్ సిరాజ్ ఓలీ పోప్ (39) కీలక వికెట్ తీశాడు. భారత్‌లో బెన్ డకెట్ అత్యంత వేగవంతమైన టెస్టు సెంచరీని నమోదు చేశాడు. రాజ్‌కోట్‌లో రెండో రోజు స్టంప్స్ వద్ద ఇంగ్లాండ్ భారత్ కంటే 238 పరుగుల వెనుకంజలో ఉంది.
2వ రోజు అరంగేట్రం ప్లేయర్ ధృవ్ జురెల్ 46 పరుగులతో రాణించాడు. రవిచంద్రన్ అశ్విన్ (37) , జస్ప్రీత్ బుమ్రా (26) సహకారంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో రోజు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ లు త్వరగానే ఔట్ అయ్యారు. అశ్విన్, జురెల్ లు ఎనిమిదో వికెట్‌కు 50+ పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మార్క్ వుడ్ ఇన్నింగ్స్‌లో అత్యధిక 4/114 వికెట్లు తీసుకున్నాడు. రెహాన్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు.
IND vs ENG: చరిత్ర సృష్టించిన అశ్విన్.. దిగ్గజాల రికార్డులు బ్రేక్.. !
ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్ లో బాజ్ బాల్ గేమ్ తో అదరగొట్టింది. ఓపెనర్ జాక్ క్రాలే 15 పరుగులు చేసి త్వరగానే ఔట్ అయినా.. మరో ఓపెనర్ బెన్ డకెట్ సెంచరీతో చెలరేగాడు. ఆట ముగిసే సమయానికి బెన్ డకెట్ 133* పరుగులు, జో రూట్ 9* పరుగులతో క్రీజులో ఉన్నారు. మరోసారి బాజ్ బాల్ గేమ్ తో ఇంగ్లాండ్ 2వ రోజు స్టంప్స్ ను 35 ఓవర్లలో 207-2 పరుగులతో ముగించింది. ఓలీ పోప్ 39 పరుగులతో రాణించాడు.
భారత్ స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ 13వ ఓవర్‌లో జాక్ క్రాలీని ఔట్ చేసి 500వ టెస్టు వికెట్‌ను అందుకున్నాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లో అత్యంత వేగంగా 500 వికెట్లు సాధించిన రెండో బౌలర్ గా నిలిచాడు. బెన్ డకెట్ తన సెంచరీతో.. భారత్ లో ఒక టెస్టు సెషన్ లో అత్యధిక పరుగులు (114 పరుగులు) చేసిన రెండో ప్లేయర్ గా నిలిచాడు. ఈ లిస్టులో భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ టాప్ లో ఉన్నాడు. ముంబయి వేదికగా 2009లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో సెహ్వాగ్ ఒక సెషన్ లో 133 పరుగులు సాధించాడు.
SARFARAZ KHAN: సర్ఫరాజ్ ఖాన్ తండ్రికి థార్ బహుమతి.. ఆనంద్ మహీంద్రా.. !