ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇవాళ విశాఖపట్టణంలో రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది.
విశాఖపట్టణం: ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశపర్చాడు.ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఇవాళ విశాఖపట్టణంలో ప్రారంభమైంది. టాస్ గెలిచి భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ లు ఓపెనర్లుగా దిగారు.ఇంగ్లాండ్ బౌలర్ తొలి ఓవర్ లో ఒకే పరుగు ఇచ్చాడు. రూట్ వేసిన రెండో ఓవర్ లో యశస్వి జైస్వాల్ రెండు ఫోర్లు కొట్టాడు. మూడో ఓవర్ లో భారత జట్టుకు మూడు పరుగులు మాత్రమే వచ్చాయి. నాలుగు, ఐదో ఓవర్ లో ఒక్కొక్క పరుగు మాత్రమే వచ్చింది. పది ఓవర్ల తర్వాత ఇంగ్లాండ్ జట్టు స్పిన్నర్లను రంగంలోకి దించింది.
also read:IND vs ENG 2nd test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
18వ ఓవర్ లో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఓటయ్యాడు. 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ శర్మ పెవిలియన్ కు చేరాడు. రోహిత్ శర్మ ఔట్ కాగానే శుభ్ మన్ గిల్ క్రీజ్ లోకి వచ్చాడు.
రోహిత్ శర్మతో అవుట్ కావడంతో భారత జట్టు బ్యాటర్లు జాగ్రత్తగా ఆడారు. 29వ ఓవర్లో శుభ్‌మన్ గిల్ కూడ రెండో వికెట్ గా వెనుదిరిగాడు. భారత బ్యాటర్లు నిరాశపర్చారు. రోహిత్ శర్మ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన గిల్ దూకుడుగా ఆడాడు. గిల్ 34 వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు.అండర్సన్ బౌలింగ్ లో శుభ్‌మన్ గిల్ ఔటయ్యాడు.శుభ్ మన్ గిల్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ కు వచ్చాడు.
భారత జట్టు బ్యాటర్ యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ సాధించాడు. 30వ ఓవర్లో జైస్వాల్ అర్ధశతకం సాధించాడు. లంచ్ బ్రేక్ సమయానికి యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ లు క్రీజ్ లో ఉన్నారు. 31వ ఓవర్లో భారత జట్టు 103 పరుగుల చేసింది.
*