
India vs England: విశాఖలో జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ రెండో టెస్టులో టీమిండియా అద్భుతమైన ఆటతీరును కనబర్చింది. రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. బ్యాటింగ్ బౌలింగ్ లో రాణించిన భారత్.. వైజాగ్ లో ఇంగ్లాండ్ ను మట్టికరిపించింది. దీంతో 5 టెస్టుల సిరీస్ లో 1-1తో ఇరు జట్లు సమంగా ఉన్నాయి. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 396 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 255 పరుగులు చేసింది. ఇక ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 253 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్ లో 292 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ 106 పరుగుల తేడాతో విజయం సాధించింది.
రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాటర్స్ లో జాక్ క్రాలే 73 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో అశ్విన్ 3, జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు తీసుకున్నాడు. మిగతా బౌలర్లు తలా ఒక వికెట్ పడగొట్టారు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ 209 పరుగులతో తన కెరీర్ లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు. జేమ్స్ ఆండర్సన్ 3,షోయబ్ బషీర్ 3, రెహాన్ అహ్మద్ 3 వికెట్లు తీసుకున్నారు. ఇంగ్లాండ్ తోలి ఇన్నింగ్స్ లో జాక్ క్రాలే 76 పరుగులు చేయగా, బెన్ స్టోక్స్ 47 పరుగులతో రాణించాడు. తొలి ఇన్నింగ్స్ లో బుమ్రా అద్భుతమైన బౌలింగ్ లో ఇంగ్లాండ్ బ్యాటర్లను దెబ్బకొట్టాడు. బుమ్రా ఆరు వికెట్లు తీసుకున్నాడు. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీసుకున్నాడు.
అద్భుతమైన క్యాచ్ పట్టిన రోహిత్ శర్మ.. బ్యాట్స్‌మన్ షాక్.. అశ్విన్ ఆశ్చర్యం !