India vs England: భారత్-ఇంగ్లాండ్ రెండో టెస్టులో టీమిండియా గెలుపు దిశగా ముందుకు సాగుతోంది. ఈ మ్యాచ్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ లో ఆద్భుతమై, ఆసాధ్యమైన క్యాచ్ ను పట్టుకుని ఒలీ పోప్ ను ఔట్ చేశాడు. రోహిత్ పట్టుకున్న సూపర్ క్యాచ్ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి,
India vs England - rohit sharma: విశాఖలో జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక అద్భుతమైన క్యాచ్ ను అందుకున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. రెప్పపాటులో రోహిత్ శర్మ క్యాచ్ అందుకున్న తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్ శర్మ ఇంత కష్టమైన, ఫాస్ట్ క్యాచ్ ఎలా అందుకున్నాడని క్రికెట్ లవర్స్ ఆశ్చర్యపోతున్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ లో ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ ఓలీ పోప్ బ్యాట్ ను తగిలిన గాల్లోకి ఎగిరింది. అసాధ్యమైన క్యాచ్ ను రోహిత్ శర్మ అందుకోవడంతో పోప్ ఔట్ గా వెనుదిరిగాడు.
0.45 సెకన్లలో అసాధ్యమైన క్యాచ్ అందుకున్న రోహిత్ శర్మ
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో 29వ ఓవర్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను బౌలింగ్ ఇచ్చాడు. 29వ ఓవర్లో రవిచంద్రన్ అశ్విన్ వేసిన రెండో బంతికి ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్ ఓలీ పోప్ షార్ప్ కట్ షాట్ కొట్టే ప్రయత్నం చేయగా, రోహిత్ మెరుపు వేగంతో స్పందించిన రోహిత్ శర్మ కేవలం 0.45 సెకన్లలో క్యాచ్ అందుకున్నాడు.
Sharp Reflexes edition, ft. captain Rohit Sharma! 👌 👌
Follow the match ▶️ https://t.co/X85JZGt0EV | | | pic.twitter.com/mPa0lUXC4C
ఓలీ పోప్ కు షాక్..
రెప్పపాటులో జరిగిపోయిన క్యాచ్ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్రౌండ్ లో ఉన్న ఆటగాళ్లు సైతం ఈ క్యాచ్ ను చూసి ఆశ్చర్యపోయారు. రోహిత్ శర్మ క్యాచ్ తో ఔట్ అయిన ఓలీ పోప్ షాక్ తిన్నట్లు కనిపించింది. అశ్విన్ కూడా రోహింత్ అందుకున్న క్యాన్ ను చూసి ఆశ్చర్యపోయాడు. రోహిత్ శర్మ క్యాచ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఓలీ పోప్ చాలా డేంజరస్ బ్యాటర్ కాబట్టి రోహిత్ శర్మ అందుకున్న ఈ క్యాచ్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ గా చెప్పవచ్చు. 21 బంతుల్లో 23 పరుగులు చేసిన ఓలీ పోప్ ఔటయ్యాడు. తన ఇన్నింగ్స్ లో 5 బౌండరీలు బాదాడు. ఓలీ పోప్ ఎక్కువ సేపు క్రీజులో ఉండి ఉంటే మ్యాచ్ ను భారత జట్టు నుంచి దూరం చేసేవాడు.
రెండో టెస్టులో విజయానికి చేరువలో భారత్
ఈ మ్యాచ్ లో జాక్ క్రాలీ వరుసగా రెండో హాఫ్ సెంచరీ సాధించగా, రెండో టెస్టు నాలుగో రోజైన సోమవారం తొలి సెషన్ లో ఇంగ్లండ్ కు 6 కీలక వికెట్లు పడగొట్టి భారత్ మ్యాచ్ పై ఆధిపత్యం ప్రదర్శించింది. లంచ్ బ్రేక్ తర్వాత కూడా బౌలర్లు రాణించడంతో ఇంగ్లాండ్ ప్రస్తుతం 279-8 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత్ విజయానికి మరో రెండు వికెట్లు కావాలి.
IND VS ENG: చరిత్ర సృష్టించిన అశ్విన్.. భారత దిగ్గజాల రికార్డులు బ్రేక్ !