IND vs SA: భారత్ తో జరగబోయే రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ టెంబా బావుమా తర్వాత మరో స్టార్ ప్లేయర్ గెరాల్డ్ కోయెట్జీ జట్టుకు దూరమయ్యాడు.
Gerald Coetzee Ruled: భారత్-దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ లో భాగంగా కేప్ టౌన్ లో జరగబోయే రెండో టెస్టు మ్యాచ్ కు ముందు సఫారీలకు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే మరో స్టార్ ప్లేయర్ దూరం కాగా, తాజాగా మరో మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ గెరాల్డ్ కోయెట్జీ కూడా దురమయ్యాడు. తొలి టెస్టులో సఫారీల ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ 23 ఏళ్ల ఆటగాడు సెంచూరియన్ లోని సూపర్ స్పోర్ట్ పార్క్ లో జరిగిన మ్యాచ్ లో కటి వాపుకు గురయ్యాడు. న్యూ ఇయర్ టెస్టుకు కోట్జీ అందుబాటులో ఉండడని క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ) అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఇప్పటికే తొడ కండరాల గాయం కారణంగా కెప్టెన్ టెంబా బవుమాను రాబోయే మ్యాచ్ నుంచి తప్పించడంతో భారత్ తో తొలి టెస్టులో గాయంతో ఎదురుదెబ్బ తగిలిన రెండో దక్షిణాఫ్రికా ఆటగాడిగా గెరాల్డ్ కోయెట్జీ నిలిచాడు. చివరి టెస్టు తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకనున్న డీన్ ఎల్గర్ జోహన్నెస్ బర్గ్ లో ప్రొటీస్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
భారత్ లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా సెమీఫైనల్ కు చేరిన సమయంలో గెరాల్డ్ కోయెట్జీ అద్భుత ప్రదర్శన చిరస్మరణీయమైన ముద్ర వేశాడు. కేవలం 8 మ్యాచుల్లోనే 19.80 సగటుతో 20 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా నాకౌట్ దశకు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. వన్డే టోర్నమెంట్లో అతని అద్భుతమైన ప్రదర్శనతో ఐపీఎల్ లో ముంబయి జట్టు అతన్ని టీంలో తీసుకుంది. జనవరి 3 నుంచి ప్రారంభం కానున్న చివరి టెస్టులో సిరీస్ ఓటమిని తప్పించుకోవడమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది.
2023లో సిక్సర్లతో గ్రౌండ్ ను హోరెత్తించిన టాప్-5 క్రికెటర్స్ ఎవరో తెలుసా..?