IND vs SA: ఎందుకు త‌ప్పించారు.. భార‌త సెల‌క్ట‌ర్ల‌పై హార్భ‌న్ సింగ్ ఫైర్

By Mahesh Rajamoni  |  First Published Dec 30, 2023, 1:59 PM IST

Harbhajan Singh: సెంచూరియన్ టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలవ్వడంపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ లో భారత జట్టు ఎంపిక‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
 


India vs South Africa Test series: జ‌ట్టులో స్టార్ ప్లేయ‌ర్స్ ఉన్నా సెంచూరియన్ లో జ‌రిగిన బ్యాక్సింగ్ డే టెస్టులో టీమిండియా  ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలవ్వడంపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ లో భారత జట్టును ఎంపిక చేసిన సెల‌క్ష‌న్ క‌మిటీని టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు. భారత టెస్టు జట్టు నుంచి చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే వంటి అనుభవజ్ఞులైన బ్యాట్స్ మెన్ ను త‌ప్పించ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నించారు. వారిని తప్పించడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌చ్చింద‌న్నారు. 

టీమిండియా ఎంపికపై హర్భజన్ సింగ్ ఆగ్రహం

Latest Videos

సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. జ‌ట్టులోని యంగ్ ప్లేయ‌ర్స్ అనుభ‌వ‌లేమి కార‌ణంగా ప‌రుగులు చేయ‌డానికి ఇబ్బందులు ప‌డ్డారు. దక్షిణాఫ్రికా బౌన్సీ పిచ్ పై నిల‌దొక్కుకోవ‌డానికి కష్టపడుతున్నారు. శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్ వంటి బ్యాట‌ర్స్ దక్షిణాఫ్రికా పేస్ అటాక్ కు ముందు నిల‌బ‌డ‌లేక‌పోయారు. అయితే, జ‌ట్టు ఎంపిక విష‌యంలో అనుభ‌వ‌జ్ఙులైన సీనియ‌ర్ ప్లేయ‌ర్ల‌కు చోటు క‌ల్పించ‌క‌పోవ‌డంతో హర్భజన్ సింగ్ సెలెక్టర్లను టార్గెట్ చేశాడు.

అత్యాచార కేసులో దోషిగా తేలిన ఐపీఎల్ ప్లేయ‌ర్..

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కు చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే వంటి అనుభవజ్ఞులైన బ్యాట‌ర్స్ ను ఎంపిక చేయకపోవడం ద్వారా సెలెక్టర్లు పెద్ద తప్పు చేశారని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. హర్భజన్ సింగ్ తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ "టెస్టు క్రికెట్ లో చతేశ్వర్ పుజారా కంటే మంచి బ్యాట‌ర్ ఇప్పటికీ మనకు లేడు. చతేశ్వర్ పుజారా నెమ్మదిగా ఆడవచ్చు, కానీ అతను ఇబ్బందుల నుండి రక్షించ‌గ‌ల‌డు. అందుకే మ‌నం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ గడ్డపై టెస్టులను గెలిచామని" పేర్కొన్నాడు.

ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే విదేశాల్లో అన్ని చోట్లా బ్యాట్ తో రాణించార‌నీ, మెరుగైన‌ పరుగులు చేశారని హర్భజన్ సింగ్ అన్నారు. కాగా, యంగ్ ప్లేయ‌ర్ల‌కు చోటు క‌ల్పించ‌డానికి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కు అజింక్య రహానేను ఎంపిక చేయకపోవడం, చతేశ్వర్ పుజారాను కూడా కొన్ని కారణాల వల్ల తప్పించారు. బాక్సింగ్ డే టెస్టులో ఒట‌మి త‌ర్వాత భార‌త జ‌ట్టులో మార్పులు చేస్తోంది బీసీసీఐ. కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్లో భారత్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు జ‌ర‌గ‌నుంది. ఈ టెస్టులో గెలిచి సిరీస్ ను 1-1తో సమం చేయాలని భారత జట్టు భావిస్తోంది.

నాగార్జునగారు నాకు దేవుడే, ఆయన డబ్బుతోనే ఆస్తులు కొన్నా..కానీ క్యారెక్టర్ మీద మచ్చ

click me!